"నా సామి రంగ" నుండి టైటిల్ సాంగ్ విడుదల..!

Pulgam Srinivas
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజాగా విజయ్ బిన్నీ దర్శకత్వంలో రూపొందిన నా సామి రంగ అనే కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ఆశికార్ రంగనాథ్ హీరోయిన్ గా నటించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఇకపోతే ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇకపోతే ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించినప్పటి నుండే ఈ సినిమా ఆల్బమ్ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.
 

ఆ అంచనాలకు తగినట్లుగానే ఈ సినిమా యొక్క ఆల్బమ్ ప్రేక్షకులను బాగా అలరించింది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బాక్స్ ఆఫీస్ రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో వీడియో సాంగ్ ను విడుదల చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా లోని నా సామి రంగా అంటూ సాగే టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ఈ సినిమా ఫిబ్రవరి 17 వ తేదీ నుండి డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: