"దేవర" నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యేది ఆ తేదీ నుండే..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా "ఆర్ ఆర్ ఆర్" అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించాడు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ హీరో గా నటించాడు. భారీ అంచనాల నడుమ ఎంతో భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన "ఆర్ ఆర్ ఆర్" మూవీ సూపర్ సక్సెస్ ను అందుకోవడం మాత్రమే కాకుండా 1200 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. అలాగే ఆస్కార్ అవార్డ్ ను కూడా దక్కించుకుంది. దీనితో ఈ సినిమాలో హీరోలుగా నటించిన ఎన్టీఆర్ , రామ్ చరణ్ కు గ్లోబల్ స్థాయి లో క్రేజ్ లభించింది .

ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" మూవీ తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో దేవర మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలాగే ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండడం ... ఈ మూవీ లో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించడం ... సైఫ్ అలీ విలన్ ఈ సినిమాలో విలన్ గా నటించడం ... ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో తారా స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి.

ఇకపోతే ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. కానీ ఈ మూవీ కి సంబంధించిన చాలా వర్క్ పెండింగ్ ఉండడంతో ఈ మూవీ ని ఏప్రిల్ 5 వ తేదీన కాకుండా వేరే తేదీన విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీ యొక్క తదుపరి షెడ్యూల్ ను ఈ మూవీ బృందం ఏప్రిల్ 16 వ తేదీ నుండి మొదలు పెట్టబోతున్నట్లు ... ఈ షెడ్యూల్ లో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రకరించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: