పుంజుకున్న ఈగల్.. లాల్ సలాం మహా దారుణం?

Purushottham Vinay
టాలీవుడ్ లో రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసే హీరోల్లో ముందు వరుసలో ఉంటారు మాస్ మహారాజా రవితేజ. తనదైన కామెడీ టైమింగ్ తో నటనతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుని ముందుకు వెళ్తున్నాడు.ఇటీవలే రవితేజ ఈగల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.రవితేజ హీరోగా, కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన సినిమా ఈగల్. ఈ హై రేంజ్ యాక్షన్ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించడం జరిగింది. అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, కావ్య థాపర్ ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. శుక్రవారమే విడుదలైన ఈ సినిమా డీసెంట్ టాక్ దక్కించుకుంది. అందువల్ల మంచి వసూళ్లు రాబడుతోంది.అయితే రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో రవితేజ ఈగల్ మూవీపై చాలా ఫోకస్ చేసి హిట్ అందుకున్నారు. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ కు ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు. డైరెక్టర్ కార్తీక్ హీరో రవితేజను మునుపెన్నడూ లేని విధంగా చక్కగా చూపించారని అంటున్నారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా బాగుందని, అందులో చివరి 40 నిమిషాలు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని సినిమా చూసిన నెటిజన్లు చెబుతున్నారు.


ఫస్ట్ డే ఈ సినిమా దాదాపు రూ.6 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. మూవీకి రెండో రోజు కూడా సాలిడ్ రెస్పాన్స్ లభించిందనే చెప్పాలి. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, రెండో రోజు సుమారు రూ. 4.75 కోట్లను రాబట్టినట్లు సమాచారం తెలుస్తోంది. దీంతో రెండు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 10 కోట్లు వసూళ్లు సాధించింది.రూ.22 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బరిలోకి దిగిన మాస్ మహారాజా.. క్లీన్ హిట్ కొట్టాలంటే ఖచ్చితంగా ఇంకో రూ.12 కోట్లు కొల్లగొట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఆదివారం (మూడో రోజు) కలెక్షన్లు పుంజుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పైగా పెద్ద హీరోల సినిమాలు కూడా ఏవి ప్రస్తుతం లేకపోవడం రవితేజకు కలిసొచ్చే అంశం.సూపర్ స్టార్ రజనీకాంత్ లాల్ సలామ్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకొని అటు తమిళనాడు ఇటు వేరే భాషల్లో కూడా చాలా దారుణమైన వసూళ్లు రాబట్టింది.అందువల్ల ఈగల్ కు ప్లస్ పాయింట్ అయ్యింది. దీంతో ఖచ్చితంగా త్వరలో ఈగల్ బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని సినీ పండితులు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: