బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ డ్రెస్లో కిల్లింగ్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న లావణ్య త్రిపాఠి..!

Pulgam Srinivas
అందాల రాక్షసి మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయిన మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ ద్వారా ఈమె మంచి గుర్తింపును తెలుగు లో సంపాదించుకొని ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో చాలా సంవత్సరాల పాటు అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది.
 

ఇకపోతే వరుస సినిమాల్లో నటిస్తున్న సమయం లోనే ఈమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ప్రేమించి కొంత కాలం క్రితమే పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి విదేశాల్లో చాలా గ్రాండ్ గా అతి కొద్ది మంది సన్నిహితల మధ్యలో జరిగింది. ఇక ప్రస్తుతం లావణ్య మరియు వరుణ్ ల సంసార జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతోంది. పెళ్లి తర్వాత లావణ్య ఇప్పటి వరకు ఏ సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. మరి భవిష్యత్తులో ఈమె సినిమాల్లో నటిస్తుందా ... లేదా అనే విషయంపై కూడా పూర్తిగా క్లారిటీ లేదు.
 

ఇకపోతే ఈ ముద్దు గుమ్మ సినిమాల విషయం కాసేపు పక్కన పెడితే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో ఈ బ్యూటీ పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్న బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ స్లీవ్ లేస్ డ్రెస్ ను వేసుకొని కిల్లింగ్ లుక్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: