"లాల్ సలామ్" డిజిటల్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
తమిళ నటుడు విష్ణు విశాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన తాను నటించిన ఎఫ్ ఐ ఆర్ ... ఘట్టా కుస్తీ సినిమాలను ఇప్పటికే తెలుగు లో విడుదల చేశాడు. ఎఫ్ ఐ ఆర్ సినిమా తెలుగు లో కూడా ఎఫ్ ఐ ఆర్ అనే టైటిల్ తోనే విడుదల కాక ... ఘట్టా కుస్తీ సినిమా తెలుగు లో మట్టి కుస్తీ పేరుతో విడుదల అయింది. ఇకపోతే ఈ రెండు సినిమాలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను సాధించకపోయినప్పటికీ ఈ రెండు మూవీ ల ద్వారా ఈయన కు తెలుగు లో పర్వాలేదు అనే స్థాయి క్రేజ్ ఏర్పడింది.

ఇకపోతే తాజాగా ఈయన లాల్ సలామ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఐశ్వర్య రజనీ కాంత్ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా ... సూపర్ స్టార్ రజనీ కాంత్ ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే ఈ మూవీ లో రజనీ కాంత్ ఓ కీలకమైన పాత్రలో నటించడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగి పోయాయి. అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఫిబ్రవరి 9 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. కాకపోతే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో భారీ కలెక్షన్ లను ప్రస్తుతం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్ట లేక పోతుంది.

ఇక పోతే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు అందులో భాగంగా కొన్ని వారాల థియేటర్ రన్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: