రామ్ చరణ్ త్వరలోనే బాలీవుడ్ సినిమా చేయనున్నాడా..?

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చెంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. చరణ్ , శంకర్ కాంబోలో రూపొందుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ మూవీ లో కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అంజలి , సునీల్  ,శ్రీకాంత్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ తర్వాత చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ లో శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుండగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. ఇకపోతే ఇప్పటికే ఒక సినిమా షూటింగ్ లో పాల్గొంటూ మరో సినిమాను లైన్ లో పెట్టిన చరణ్ ... బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందబోయే సినిమా తర్వాత హిందీ సినిమాలో నటించాలి అని అనుకుంటున్నాట్లు తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే రామ్ చరణ్ "గేమ్ చేంజర్" మూవీ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో నటించబోతున్నాడు. ఈ మూవీ తర్వాత ఏ సినిమాలో నటించబోతున్నాడు అనే విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇకపోతే ప్రస్తుతం చరణ్ నేరుగా ఓ హిందీ సినిమాలో నటించాలి అనే ఉద్దేశంతో పలువురు దర్శకులు చెబుతున్న కథలను వింటున్నట్లు అందులో ఏదైనా కథ సెట్ అయినట్లు అయితే నేరుగా హిందీ సినిమాలో చరణ్ నటించే అవకాశం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: