రామ్ చరణ్ గురించి క్రేజీ న్యూస్.. నిజమైతే బాగుండు అనుకుంటున్న ఫ్యాన్స్?
ఈ క్రమంలోనే చరణ్ కోసమే ప్రత్యేకంగా కథలను సిద్ధం చేసుకుంటున్న డైరెక్టర్ల సంఖ్య కూడా పెరిగిపోయింది. అయితే చరణ్ కూడా అటు వరుసగా కథలు వింటూ కథ నచ్చితే వెంటనే ఓకే చెప్పేయడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న చరణ్.. ఆ తర్వాత బుచ్చిబాబు సన తో ఒక మూవీ చేయబోతున్నాడు. ఇక అటు వెంటనే గౌతం తిన్ననూరితో కూడా ఒక మూవీ చేయనున్నాడు అన్న తెలుస్తోంది. అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్టు లిస్టులో బాలీవుడ్ లోని ఒక బడా డైరెక్టర్ కూడా చేరిపోయాడట. తనదైన సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సంజయ్ లీలా బన్సాలితో సినిమా చేయబోతున్నారట రామ్ చరణ్.
ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇది నిజమైతే బాగుండని అటు రామ్ చరణ్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు అని చెప్పాలి. ఇక ఇదే విషయంపై సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు పెడితే కొంతమంది ఇంటర్నెట్లో వైరల్ గా మార్చేస్తూ ఉన్నారు. అయితే నిజంగానే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే మాత్రం ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న రికార్డులు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని సినీ విశేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.