రవితేజ నటించిన ఆ సినిమాను కూడా రీ రిలీజ్ చేయనున్నారా..?

Pulgam Srinivas
మాస్ మహారాజా రవితేజ కొన్ని సంవత్సరాల క్రితం దుబాయ్ శీను అనే సినిమాలో హీరో గా నటించిన విషం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి శ్రీను వైట్ల దర్శకత్వం వహించగా ... లేడీ సూపర్ స్టార్ నయన తార ఈ సినిమాలో రవితేజ కు జోడి గా నటించింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇలా ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.

ఇకపోతే కొన్ని రోజుల క్రితమే రవితేజ హీరో గా నటించిన వెంకీ సినిమా రీ రిలీస్ అయ్యింది. ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఇకపోతే వెంకీ సినిమాకు కూడా శ్రీను వైట్ల నే దర్శకుడు కావడం విశేషం. ఇలా ఇప్పటికే వెంకీ మూవీ రీ రిలీస్ అయ్యి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ను జనాల నుండి తెచ్చుకోవడంతో దుబాయ్ శీను సినిమా ఏ రేంజ్ రెస్పాన్స్ ను రీ రిలీస్ లో బాగంగా తెచ్చుకుంటుందో అని చాలా మంది ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా రవితేజ "ఈగల్" అనే సినిమాలో హీరో గా నటించాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ , కావ్య దాపర్ హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమా ఈ రోజు అనగా ఫిబ్రవరి 9 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల కానుంది. మరి రవితేజ ఆఖరుగా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకులను కాస్త నిరోత్సాహ పరిచాడు. మరి ఈగల్ మూవీ తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో అనే విషయం తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: