అఫిషియల్ : "బీమా" మ్యూజిక్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..!

Pulgam Srinivas
మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం బీమా అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ఏ హర్ష దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి చిత్ర బృందం ఓ వీడియోని విడుదల చేయగా అది అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా తరా స్థాయికి చేరిపోయాయి. ఇకపోతే ఈ మూవీ లో గోపీచంద్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలోని గోపీచంద్ కు సంబంధించిన పోలీసులు లుక్ లో ఉన్న అనేక పోస్టర్ లను విడుదల చేయగా అందులో గోపీచంద్ అదిరిపోయే రేంజ్ పవర్ ఫుల్ లుక్ లో ఉన్నాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు.
 

ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సంగీత హక్కులను ఓ ప్రముఖ ఆడియో సంస్థ కు అమ్మి వేశారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేశారు. ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క సంగీత హక్కులను "సరిగమ" సంస్థకు అమ్మి వేసింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం అది వైరల్ అవుతుంది. ఇకపోతే గోపీచంద్ ఆఖరుగా శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందిన రామబాణం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో బ్యూటిఫుల్ నటిమని డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మరి బీమా సినిమాతో గోపీచంద్ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: