హాట్ టాపిక్ గా మారిన మమ్ముట్టి బ్లాక్ అండ్ వైట్ ప్రయోగం !

Seetha Sailaja
ఈనాటితరం ప్రేక్షకులు బ్లాక్ అండ్ వైట్ సినిమాల గురించి ఎరగరు. అప్పుడప్పుడు బుల్లితెర పై ఛానల్స్ లో ప్రసారం అయ్యే సినిమాలు అదేవిధంగా పాటలలో ఆనాటి నటీనటులను బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో చూస్తున్నారు. నేటితరం పూర్తిగా మర్చిపోయిన ఆ బ్లాక్ అండ్ వైట్ ప్రయోగంలో మళయాళ టాప్ హీరో మమ్ముట్టి నటిస్తూ ఉండటం హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం టెక్నాలజీ పూర్తిగా పెరిగిన నేపధ్యంలో కలర్ సినిమాలను కూడ ఎవరు పట్టించుకోవడంలేదు. ఐమాక్స్ డాల్బీ విజన్ 8కె అంటూ రకరకాల స్పెషాలిటీలతో సినిమాలు తీయగలిగినప్పుడు మాత్రమే ఆ సినిమా బాగుంటే జనం చూస్తున్నారు. ఐమాక్స్ స్క్రీన్స్ అలవాటు పడిన తరువాత సింగిల్ ధియేటర్లలో సినిమాలు చూడటానికి పట్టణ ప్రాంతాల ప్రజలు ఆశక్తి కనపరచడంలేదు.

ఇలాంటి పరిస్థితులు కొనసాగుతూ ఉంటే మమ్ముట్టి సుమారు 50 సంవత్సరాల క్రితంనాటి బ్లాక్ అండ్ వైట్ టెక్నాలజీ వైపు అడుగులు వేయడం షాకింగ్ గా మారింది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తీయబోతున్నారు. పూర్తిగా బ్లాక్ అండ్ వైట్ లో తీయబడ్డ ఈమూవీ పేరు ‘భ్రమ యుగం’ కరోనా సమయంలో రేవతి ప్రధాన పాత్రలో నటించిన ‘భూతకాలం’ అనే హరర్ మూవీని తీసిన రాహుల్ సదాశివన్ ఈమూవీకి దర్శకత్వం వహించాడు.

ఈమూవీకి సంబంధించిన బీజీఎమ్ సౌండ్ ట్రాక్ ని ఈమధ్య యూట్యూబ్ లో రిలీజ్ చేసినప్పుడు ఈ టీజర్ కు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ ప్రయోగం సక్సస్ అయితే రానున్న రోజులలో మరికొందరు ఈ ప్రయోగం బాట పట్టే ఆస్కారం ఉంది. యడం హాట్ టాపిక్ గా మారింది. 2023లో దర్శకుడు రాజ్ మాదిరాజు ఇదే తరహాలో ‘గ్రే’ అనే సినిమా కేవలం బ్లాక్ అండ్ వైట్ లో తీస్తే ఎవరు పట్టించుకోలేదు. మరి మమ్ముట్టి ప్రయోగానికి పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: