తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరో చెప్పిన వరుణ్ తేజ్..!?

Anilkumar
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గత ఏడాది  తను ఎంతగానో ప్రేమించిన తన ప్రియురాలు లావణ్య త్రిపాటిని పెళ్లి చేసుకుని  ఒక ఇంటివాడయ్యాడు. మూడుముళ్ల బంధంతో ఒకటైన ఈ జంట ప్రస్తుతం ఒకవైపు తమ మ్యారేజ్ జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే ఇద్దరు భార్య భర్తలు వరుస సినిమాలు చేస్తున్నారు. వీరిద్దరూ కూడా ముందు నుండి నటులే కావడంతో ప్రస్తుతం తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. వరుణ్ తేజ్ సైతం తన సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ఆపరేషన్ వాలంటైన్. ఆపరేషన్ వాలంటైన్ తొలి తెలుగు ఎయిర్ ఫోర్స్ చిత్రంగా రిలీజ్ కి రెడీ అవుతోంది.

మార్చ్ 1 న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీనితో ఆల్రెడీ ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఆపరేషన్ వాలంటైన్ చిత్ర యూనిట్ మల్లారెడ్డి కాలేజ్ లో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. విద్యార్థులు అడిగిన అనేక సరదా అంతే సరదాగా వరుణ్ తేజ్ సమాధానం ఇచ్చారు. ఓ స్టూడెంట్ మాట్లాడుతూ.. అన్నా మీ ఫేవరిట్ హీరోయిన్

 ఎవరు అని ప్రశ్నించాడు.. దీనికి వరుణ్ తేజ్ ఏమాత్రం సిగ్గు పడకుండా నా ఫేవరిట్ హీరోయిన్ ని ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను. నా ఫేవరిట్ హీరోయిన్ మా ఇంట్లోనే ఉంది అని వరుణ్ తేజ్ ఇంకా ఫన్నీగా చెప్పాడు. మరో విద్యార్థి మేడం కాకుండా మీ ఫేవరిట్ ఎవరు అని ప్రశ్నించగా అప్పడు అసలు సమాధానం బయటకి వచ్చింది. బయట హీరోయిన్లలో తనకి సాయి పల్లవి అంటే చాలా ఇష్టం అని వరుణ్ తెలిపాడు. వరుణ్ తేజ్ పెళ్లయ్యాక సాయి పల్లవి లాంటి గొప్ప నటిని పక్కకి నెట్టి తన భార్యకి ప్రాధాన్యత ఇస్తున్నాడు అంటూ కామెంట్స్ పేలుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: