అరి సినిమా ఫై ఫోకస్ చేసిన బాలీవుడ్ కోలీవుడ్!

Anilkumar
సాధారణంగా ఒక భాషలో ఎంతో సక్సెస్ అయినటువంటి సినిమాలు ఇతర భాషలలోకి రీమేక్ అవడం సాధారణంగా జరిగే విషయం. ఇలా ప్రస్తుతం కోలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ సెలబ్రెటీలందరూ కూడా తెలుగులో తెరకెక్కుతున్న అరి సినిమాపై ఫోకస్ చేశారు. ఈ సినిమాని కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీమేక్ చేయాలనే ఆలోచనలో ప్రముఖ హీరోలు ఉన్నట్టు సమాచారం.

పేపర్ బాయ్ సినిమా ద్వారా దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ జయశంకర్ తాజాగా అరి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమాను షడ్రుచులు, అరిషడ్వర్గాలు అంటూ ఇలా ఒక వినూత్న కాన్సెప్ట్‌తో ఎంపిక చేశారు. ఇక ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తున్నారనే సంగతి మనకు తెలిసిందే.
అనసూయ, సాయి కుమార్, శుభలేఖ సుధాకర్ వంటి వారు నటించారు. కమెడియన్ హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్‌లు కూడా ముఖ్య పాత్రలను పోషించారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాని ఇతర భాషలలోకి రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి శివ కార్తికేయన్ ఇటీవల జనసేన ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ జయశంకర్ ను కలిశారు.
ఈ సమయంలోనే ఈ సినిమాపై శివ కార్తికేయ ప్రశంశలు కురిపించుటమే కాకుండా ఈ సినిమాని రీమేక్ చేయాలని ఆలోచనలో ఉన్నారని కూడా వెల్లడించారు. ఇక కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాని రీమేక్ చేయాలని భావించారట ప్రముఖ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ కూడా ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. ఇలా ఇతర భాష చిత్రాలలో కూడా ఈ సినిమాని రీమేక్ చేయాలనే ఆలోచించడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: