ఈగల్ సినిమా క్వాలిటీ పై నిర్మాత కామెంట్స్.. 100 కోట్ల రేంజ్ అంటూ?

Anilkumar
రవితేజ హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైనటువంటి చిత్రం ఈగల్. ఈ సినిమా ఫిబ్రవరి 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా సంక్రాంతి పండుగకు విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ ఫిబ్రవరి 9వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ సినిమా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టి విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్నటువంటి తరుణంలో నిర్మాత విశ్వప్రసాద్ కూడా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. సాధారణంగా సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉండే ప్రసాద్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నారు.
ఇండస్ట్రీలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న సంగతి మనకు తెలిసిందే .అయితే ఇటీవల కాలంలో ఈ బ్యానర్ లో వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇకనుంచి ప్రతి నెల ఒక సినిమా పీపుల్స్ మీడియా వారి నుంచి విడుదలకు సిద్ధమవుతుంది. ఈ ఇంటర్వ్యూలలో భాగంగా ఈయన తమ నిర్మాణ సంస్థను ఇంకా అభివృద్ధి పరచడం కోసం కొన్ని ఆలోచనలు చేసామని వాటిని అనుసరించబోతున్నామని తెలిపారు
ఇక ఈగల్ సినిమా గురించి కూడా ఈయన మాట్లాడుతూ సినిమా చేయడం మాత్రమే మన బాధ్యత కాదు సినిమాని రిలీజ్ చేసుకోవడం కూడా మన బాధ్యత అంటూ మాట్లాడారు.. 100 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా చేస్తే క్వాలిటీ ఎలా ఉంటుందో ఈగల్ సినిమా క్వాలిటీ కూడా అలాగే ఉందని, తక్కువ బడ్జెట్ లోనే మేము 100 కోట్ల రేంజ్ క్వాలిటీ తీసుకువచ్చామని విశ్వప్రసాద్ తెలిపారు. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు అంటూ ఈయన సినిమాపై ఎన్నో అంచనాలను పెంచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: