ఈగల్‌పై రవితేజ రియాక్షన్ ఇదే.. టికెట్లు రేట్లు ఎంతంటే?

Anilkumar
రవితేజ ఈగల్ సినిమాకు ఇప్పుడు ఫుల్ పాజిటివ్ టాక్ ఉంది. టీజర్, ట్రైలర్ స్టైలీష్‌గా ఉండటం, మేకింగ్ పరంగా కూడా అందరినీ ఆకట్టుకుంది.కెమెరామెన్ కాస్త డైరెక్టర్‌గా మారడంతో ఆ క్వాలిటీ కూడా ట్రైలర్‌లో కనిపిస్తుంది. మామూలుగా ట్రైలర్ రిలీజ్ చేస్తే కథ ఏంటో అందరికీ అర్థమైపోతుంది. కానీ ఈగల్ కథ ఏంటన్నది ఎవ్వరూ గెస్ చేయలేకపోతోన్నారు. సినిమాను చూడాలన్న ఆసక్తిని ట్రైలర్ ఇట్టే పెంచేసింది.ఇక తాజాగా సినిమాను చూసిన రవితేజ దర్శక నిర్మాతలు ఫుల్ ఖుషీగా ఉన్నారు. రవితేజ అయితే సినిమాను చూసి చిన్న పిల్లాడిలా మారిపోయాడు. రవితేజ ఫస్ట్ రియాక్షన్, ఫస్ట్ రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

 పూర్తిగా సంతృప్తి చెందానంటూ రవితేజ ఇచ్చిన రియాక్షన్‌కు మాస్ మహారాజా ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఈసారి రికార్డులను లేపి అవతల పారేస్తామనే ధీమాలో ఉన్నారు.ఇక తాజాగా ఈగల్‌కు సంబంధించిన టికెట్ రేట్ల అంశం మీద చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు ఇతర నిర్మాతల్లా ఇష్టారీతిన టికెట్ల రేట్లు పెంచి జనాల్ని దోచుకోవాలని చూడటం లేదు. సాధారణ టికెట్ రేట్లతోనే ఈగల్ బరిలోకి దిగుతోంది. మల్టీప్టెక్సులో గరిష్టంగా రూ. 200 ఉంటుందట. సింగిల్ స్క్రీన్‌లో గరిష్టంగా రూ. 150 ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ మూవీ మాత్రం ఇప్పుడు ఫుల్ పాజిటివ్ బజ్‌ను ఫిబ్రవరి 9న రిలీజ్‌కు రెడీగా ఉంది.

మాస్ మహారాజ రవితేజకు ధమాకా మూవీ తర్వాత ఆ రేంజ్ హిట్ దక్కలేదు. గతేడాది రావణాసురతో పాటు భారీ అంచనాల మధ్య వచ్చిన ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. అయితే, రవితేజ హీరోగా నటించిన ఈగల్ మూవీపై మంచి హైప్ ఉంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ   ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలోకి రానుంది. ట్రైలర్ అదిరిపోవటంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: