నా సినిమాను అనే ముందు.. మీ కొడుకు చూడండి మీర్జాపూర్ చూడు : సందీప్ వంగ

praveen
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చిన యానిమల్ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించారు అని చెప్పాలి. ఈ సినిమా ఎంత సూపర్ హిట్ అయినప్పటికీ కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొంది. ఏకంగా క్రూరమైన పురుషత్వాన్ని చూపించే విధంగా యానిమల్ మూవీ లో రణబీర్ కపూర్ పాత్ర ఉంది అంటూ ఎంతో మంది విమర్శలు చేశారు.

 అయితే ఇలా తన సినిమాపై విమర్శలు చేస్తున్న వారికి గట్టిగా కౌంటర్ ఇస్తూనే వస్తున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి. ఇక ఇప్పుడు రచయిత జావేద్ అక్తర్ సైతం యానిమల్ మూవీ పై ఇలాంటి విమర్శలు చేశాడు. ఇలాంటి సినిమాలు సమాజానికి ప్రమాదకరం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇక జావేద్ అక్తర్ కామెంట్స్ పై స్పందించిన డైరెక్టర్ సందీప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన సినిమాపై వేలు చూపించే ముందు జావేద్  కొడుకు ఫర్హాన్  అక్తర్ చేసే కంటెంట్ను పర్యవేక్షించాలి అంటూ కోరాడు. ఆయన సినిమా చూడలేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కామెంట్ లో తను సినిమా మొత్తం చూడలేదని చాలా క్లియర్ గా కూడా ఉంది. ఇప్పుడు ఎవరైనా సినిమా చూడకుండా మాట్లాడితే వారి గురించి ఏం చెప్పాలి.. ఆయన సినిమా చూడలేదు ఆయన మాత్రమే కాదు.. ఈ కళాఖండంపై రాళ్లు విసురుతున్న ఎవరైనా వారు ముందుగా పరిసరాలను ఎందుకు తనిఖీ చేసుకోరు అంటూ ప్రశ్నించాడు. మీర్జాపూర్ వెబ్ సిరీస్ ను నిర్మిస్తున్నప్పుడు తన కుమారుడు ఫర్హాన్ అక్తర్ కు ఇదే మాట ఎందుకు చెప్పలేదు అంటూ సందీప్ ప్రశ్నించాడు. ప్రపంచంలో ఉన్న బూతులన్నీ మీర్జాపూర్ లోనే ఉన్నాయి ఆ వెబ్ సిరీస్ దెబ్బకు నేను మొత్తం షో కూడా చూడలేదు అంటూ సందీప్ కౌంటర్ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: