రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాలో ఆ స్టార్ హీరోయిన్?

Anilkumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ చేంజర్' షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరికొద్ది రోజుల్లోనే చరణ్ ఈ సినిమా షూటింగ్ని పూర్తి చేయనున్నారు. ఇక ఈ సినిమా తర్వాత 'ఉప్పెన' డైరెక్టర్ బుచ్చిబాబుతో తన 16వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రూరల్ బ్యాక్ డ్రాప్ లో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ గతంలో మునుపెన్నడూ కనిపించని డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టు త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధమైంది.

డైరెక్టర్ బుచ్చిబాబు మార్చిలో ఈ సినిమాని సెట్స్ పైకి కి తీసుకెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ షాకింగ్ లీక్ బయటికి వచ్చింది. అదేంటంటే.. రాంచరణ్ - బుచ్చిబాబు సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత ఓ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా రూరల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండడంతో ఇందులో మూవీ టీమ్ ఇంపార్టెంట్ రోల్ కోసం సమంతను సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది. సమంత కూడా ఇందుకు ఓకే చెప్పిందని అంటున్నారు. అయితే ఈ విషయాన్ని సమంత ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఇప్పటికే సుకుమార్ తెరకెక్కించిన విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ 'రంగస్థలం' లో

రామ్ చరణ్ సమంత ల జోడి ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలో సమంత పల్లెటూరి అమ్మాయి పాత్రలో అదరగొట్టేసింది. ఇప్పుడు అలాంటి రూరల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న 'RC16' లో సమంత కీ రోల్ ప్లే చేస్తుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. ఈ సినిమాలో తమిళ విలక్షణ నటుడు విజయ సేతుపతి తో పాటు కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ సైతం ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమా, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: