థమన్.. ఓ బాలీవుడ్ ఆఫర్!

Anilkumar
ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు ఎస్.ఎస్ తమన్. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన 'అలవైకుంఠపురంలో' సినిమాకి తమన్ కంపోజ్ చేసిన సాంగ్స్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవ్వడంతో మ్యూజిక్ డైరెక్టర్ గా అతని క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. దాంతో తమన్ కి వరుస ఆఫర్లు తలుపు తట్టాయి. సంవత్సరానికి అరడజను సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన 'గుంటూరు కారం'తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్ కి మరో అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లు సౌత్ లో తన మ్యూజిక్ తో అదరగొట్టిన తమన్ ఇప్పుడు బాలీవుడ్ కి వెళ్తున్నాడు.

మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ కి తాజాగా ఓ బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. అది కూడా వరుణ్ ధవన్ లాంటి స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ రావడం విశేషం. తమిళంలో విజయ్ నటించిన 'తెరి' మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్ లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ఇందులో  కీర్తి సురేశ్, వామికా గబ్బి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇన్నాళ్లు #VD18 పేరుతో పిలుస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాజాగా టైటిల్ తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాకి 'బేబీ జాన్' అనే టైటిల్ని ఖరారు చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ ఆకట్టుకుంది. ఇదే సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ లో తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. గతంలో దేవి శ్రీ ప్రసాద్ ఒకటి,

రెండు హిందీ సినిమాలకు మ్యూజిక్ అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తమన్ సైతం అదే రూట్ లో వెళ్తున్నాడు. మరి ఈ బాలీవుడ్ ఆఫర్ తో తమన్ అక్కడ కూడా ప్రూవ్ చేసుకుంటాడేమో చూడాలి. జవాన్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను సమర్పిస్తుండగా.. ప్రియా అట్లీ నిర్మిస్తోంది. కలీస్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్, రాజ్‌పాల్ యాదవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వరుణ్ చివరిగా జాన్వీ కపూర్ తో కలిసి 'బవాల్' మూవీలో నటించాడు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. తర్వాత రణ్‌వీర్ సింగ్ నటించిన రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీలో అతిథి పాత్రలో కనిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: