కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుహాస్. ఈ సినిమా ఏకంగా జాతీయ అవార్డును సైతం అందుకుంది. ఆ తర్వాత 'రైటర్ పద్మభూషణ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. ముఖ్యంగా మహిళలను బాగా ఆకట్టుకుంది. తన బాడీ లాంగ్వేజ్ కి సూట్ అయ్యేలా కంటెంట్ ఉన్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సుహాస్ హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణిస్తున్నాడు. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన అడివి శేష్ 'హిట్ 2' చిత్రంలో నెగెటివ్ రోల్ పోషించి అలరించాడు. ఇక తాజాగా మరో ఎమోషనల్ హార్డ్ హిట్టింగ్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం
'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'.దుశ్యంత్ కటికినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శివాని నాగరం హీరోయిన్ గా నటించగా శరణ్య ప్రదీప్, 'పుష్ప' ఫేమ్ జగదీశ్ ప్రతాప్ బండారి ప్రధాన పాత్రల్లో నటించారు. జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహార్ మ బ్యానహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌బ్యానర్లో సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ మంచి రెస్పాన్స్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ రిలీజ్ చేశారు. దాంతో ఈ మూవీ విడుదలైన ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ప్రీమియర్ల షోలతో క్రిటిక్స్ నుంచి సైతం ప్రశంసలు వచ్చాయి.
మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 2.28 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకున్న ఈ సినిమా రెండో రోజు సుమారు రెండున్న కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. మొత్తంగా రెండు రోజుల్లోనే రూ.5.16 కోట్లు రాబట్టింది ట్రేడ్ వర్గాలను సర్ప్రైజ్ చేసింది. సినిమాకు పాజిటిట్ బజ్ రావడం, వీకెండ్ కావడం అంబాజీ పేట మ్యారేజ్ బ్రాండు కి ప్లస్ అయ్యింది. డే1 కంటే డే2 ఎక్కువ కలెక్షన్స్ రావడంతో వీకెండ్ కల్లా ఈ సినిమాకి మరింత ఎక్కువ వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు ట్రేడ్ వర్గాలు. పైగా ప్రస్తుతం థియేటర్లో పెద్ద సినిమాల సందడి, ఇతర సినిమాల పోటీ లేకపోవడంతో సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.