చికెన్ కడిగితే విషమే..నిజం బయటపెట్టిన ఆస్ట్రేలియా ఆహార భద్రతా నిపుణులు. !

Divya
మనలో చాలా మంది చికెన్ తినడానికి మక్కువ చూపుతారు. చికెన్ తో (ఫ్రై, కబాబ్, కర్రీ) రకరకాల వంటలు తయారు చేసుకుని తింటూ ఉంటారు. చికెన్ వండే సమయంలో చాలామంది చికెన్ ని శుభ్రపరుస్తుంటారు. అయితే ఇలా చేయడం తప్పని ఆస్ట్రేలియా ఆహార భద్రత మండలి నిపుణులలో ఒకరైన జాలియన్ కాక్స్ చాలా ప్రమాదమని తెలియజేస్తున్నారు. కోడిని శుభ్రపరచడం వల్ల ఆ నీటి తుంపర్ల ద్వారా ఒక హానికరమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుందని తెలియజేస్తున్నారు. మరి వాటి గురించి పూర్తిగా చూద్దాం.


చికెన్ ను కడిగినప్పుడు ఆ నీటి తుంపర్లు వంటింట్లో ఉండే వస్తువుల పైన పడడం వల్ల దీనివల్ల సాల్మొనెల్లా అనేటువంటి ఒక హానికరమైన బాక్టీరియా బయటికి వస్తుందని ,దీన్నే క్రాస్ కాలుష్యం అంటారని తెలుపుతున్నారు. మనం దుకాణాల నుంచి కొనుగోలు చేసిన చికెన్ ని అప్పటికే శుభ్రపరిచి, కాలుస్తారు కాబట్టి మళ్లీ కడగాల్సిన పనిలేదు. కానీ చాలామంది కోడి మాంసాన్ని కడిగి ఆ కడిగిన చేతులతోనే కూరగాయలను ఇతర ఆహారాన్ని తాకడం వల్ల బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. దీనివల్లే ఫుడ్ పాయిజన్, యూరినరి ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వంటివి వచ్చే ప్రమాదం ఉందని తెలియజేస్తున్నారు.



వంట గది లో కాలుష్యం జరగకుండా శుభ్రంగా ఉండాలి అంటే వంట గదిలో ఎలాంటి మాంసాహారాన్ని కడగకూడదని, పచ్చి మాంసాన్ని కోయడానికి ఒక చాపింగ్ బోర్డును ప్రత్యేకించి ఉపయోగించడం మంచిదని తెలియజేస్తున్నారు. పచ్చి మాంసాన్ని తాకిన వెంటనే సబ్బుతో బాగా చేతులను శుభ్రంగా కడుకోవాలని, అలాగే చికెన్ ను 80 డిగ్రీల వరకు పూర్తిగా ఉడికించేలా చూసుకోవాలని తెలియజేస్తున్నారు. ఎక్కువ వేడికి ఈ బ్యాక్టీరియా మరణిస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. పచ్చి చికెన్ ని కడగడం మానేసి సరైన శుభ్రత పద్ధతులను పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది అంటూ నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: