‘మన శంకర వరప్రసాద్ గారు’: అంత బాగున్న శశిరేఖ ప్రోమో కి అదొక్కటే మైనస్ గా మారబోతుందా..!?

Thota Jaya Madhuri
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సౌత్ క్వీన్ నయనతార హీరోయిన్‌గా దర్శకుడు అనీల్ రావిపూడి రూపొందిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ & ఎమోషనల్ ఎంటర్టైనర్ “మన శంకర వరప్రసాద్ గారు” షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అనీల్ స్టైల్‌కు తగ్గట్టు కామెడీ, ఎమోషన్‌లతో పాటు మెగా ఫ్యాన్స్‌కి నచ్చే మాస్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో బోలెడు ఉన్నాయనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ఇప్పటికే సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ దక్కించుకొని సరైన బజ్ క్రియేట్ చేసింది. చిరంజీవి ఎనర్జీ – భీమ్స్ సౌండ్ డిజైన్ కాంబినేషన్ ఆ సాంగ్‌కి మంచి ప్లస్ అయ్యింది. అందుకే నెక్ట్స్ ఏం వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైంలో…



ఇటీవల చిత్ర బృందం శశిరేఖ అనే రెండవ సింగిల్‌ను అనౌన్స్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా ప్రోమోను విడుదల చేసింది. కేవలం కొన్ని సెకన్ల ప్రోమో అయినప్పటికీ అందులో కనిపించిన విజువల్స్ చాలా ప్రామిసింగ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా చిరంజీవి – నయనతార స్క్రీన్ ప్రెజెన్స్ ఈ సాంగ్‌లో ఒక క్లాసిక్ రొమాంటిక్ ఫీలింగ్ ను ఇస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఈ సాంగ్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది పూర్తిగా ఒక రొమాంటిక్ కపుల్ డ్యూయెట్‌గా తెరకెక్కినట్టు క్లియర్‌గా ఫీల్ అవుతోంది. చిరంజీవి లుక్, నయనతార స్టైలింగ్, స్లో బీట్ విజువల్స్—అన్నీ ఒక రిచ్ ఫీల్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. చిత్రానికి సంగీతం అందిస్తున్న భీమ్స్ సిసిరోలియో మరోసారి మంచి రొమాంటిక్ మెలోడి బీట్ ఇచ్చినట్టు ప్రోమో చూసిన ప్రేక్షకులు కామెంట్ చేస్తున్నారు. స్లో రొమాంటిక్ నంబర్లలో కూడా తన మ్యూజికల్ స్టైల్‌ని చూపించగలడని ఈసారి మరోసారి ప్రూవ్ చేస్తున్నాడు.



అయితే ఒక చిన్న విషయమైతే సోషల్ మీడియాలో డిస్కషన్ అవుతోంది. ప్రోమోలో నయనతార వేసుకున్న కొన్ని కాస్ట్యూమ్స్‌పై కొంతమంది నెటిజన్లు “కొంచెం విభిన్నంగా ఉన్నాయి”, ఎబ్బెట్టుగా ఉన్నాయి..అంటున్నారు.  “పాట వచ్చాక ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి” . ఇవి పాట రిలీజ్ అయిన తర్వాత  నెగిగటివ్ టాక్ తీసుకువచ్చే అవకాశం ఉందని కొంతమంది చెప్పుకుంటున్నారు. కానీ రొమాంటిక్ సాంగ్స్‌లో నయన్ స్టైల్‌కు ఎప్పుడూ ప్రత్యేక ఫ్యాన్‌బేస్ ఉండటంతో, చివరకు ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాతే నిజమైన స్పందన ఎలా ఉంటుందో తేలనుంది..!?



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: