ఫ్యాన్స్ కి బిగ్ డిసప్పాయింట్ మెంట్..పెళ్లి తరువాత అలాంటి నిర్ణయం తీసుకున్న సమంత..!?

Thota Jaya Madhuri
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత ఇటీవలే రెండోసారి వివాహ బంధంలో అడుగు పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ప్రముఖ దర్శక–నిర్మాత రాజ్ నిడిమోరుతో సమంత నిశ్శబ్దంగా పెళ్లి చేసుకోవడం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది. అయితే పెళ్లి తర్వాత వెంటనే హనీమూన్‌కి వెళ్తారని ఫ్యాన్స్ ఊహించినా… అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ పూర్తిగా దీనికి విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి తరువాత కొత్త జీవితం ప్రారంభించిన సమంత–రాజ్ నిడిమోరు జంట వెంటనే విదేశీ ట్రిప్‌కు వెళ్లి రిలాక్స్ అవుతారని చాలా మంది అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో హనీమూన్ క్యాన్సిల్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే… సమంత ప్రస్తుతం తన కెరీర్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


ఈ నిర్ణయం తర్వాత సమంత షూటింగ్‌లో బిజీ అయిపోయింది. సెట్స్‌లో మేకప్ అవుతున్న ఫోటోను ఆమె  సోషల్ మీడియాలో షేర్ చేస్తూ “లెట్స్ డూ దిస్” అనే క్యాప్షన్ పెట్టింది. అలాగే సెట్స్‌లో ఉన్న మరికొన్ని స్టిల్స్‌ను కూడా పంచుకుంది. దీంతో సమంత, రాజ్ నిడిమోరు హనీమూన్‌ను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. కెరీర్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ దంపతులు కలిసి నిర్ణయించుకున్నారని అంటున్నారు.ఇప్పటివరకు నటిగా అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలు చేసిన సమంత, ప్రస్తుతం తన సొంత నిర్మాణ సంస్థలో రూపొందుతున్న ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.



సమంత ప్రస్తుతం స్క్రిప్ట్ సెలక్షన్‌లో కూడా చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌ని మరింత స్ట్రాంగ్‌గా మార్చుకోవాలనే ఆలోచనతో ఏ చిన్న పనైనా ప్లాన్ ప్రకారం ముందుకు తీసుకెళ్తోంది.సమంత పెళ్లి తరువాత హనీమూన్ ఫోటోలు కోసం ఎదురు చూస్తున్న ఆమె అభిమానులు మాత్రం ఈ వార్తపై కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే మరోవైపు సమంత కెరీర్‌ను మరింత సీరియస్‌గా తీసుకోవడం పట్ల మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.సమంత వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా, ఆమె అభిమానులు మాత్రం త్వరలోనే ఈ జంట నుండి అందమైన హనీమూన్ పిక్స్ చూడాలని ఆశిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: