RC16 టాప్ సీక్రెట్ లీక్ చేసిన బిగ్ బాస్ సోహెల్!

Anilkumar
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. శంకర్ డైరెక్షన్లో నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' చిత్రీకరణ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుక విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఎన్టీఆర్ 'దేవర' రిలీజ్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కి పోస్ట్ పోన్ అవడంతో గేమ్ 'చేంజర్' రిలీజ్ పై ఇంకాక్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంటనే రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాతో బిజీ కానున్నారు. 'RC16' అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

 ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి బిగ్ బాస్ సోహెల్ కొన్ని ఆసక్తికర అప్డేట్స్ రివీల్ చేసాడు.బుచ్చిబాబు - రామ్ చరణ్ సినిమాకి సంబంధించి బిగ్ బాస్ సోహెల్ ఓ షాకింగ్ విషయాన్ని రివీల్ చేశాడు.తను హీరోగా నటించిన 'బూట్ కట్ బాలరాజు' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటూ 'RC16' గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి." బుచ్చిబాబు అన్న నాకు బాగా క్లోజ్. నేను రెగ్యులర్ గా బుచ్చిబాబు అన్నతో మాట్లాడుతుంటాను. నా సమస్యలు కూడా అన్నకి చెప్పుకుంటాను. ఇండ్రస్ట్రీ లో ఆయన నాకు మంచి ఫ్రెండ్. రీసెంట్ గా బుచ్చిబాబు అన్నని కలిశాను.

రాంచరణ్ గారితో పాన్ ఇండియా చిత్రం చేస్తున్నారు, బిగ్ అఛీవ్మెంట్ మీకు ఇది అని చెప్పను. వెంటనే బుచ్చిబాబు అన్న మాట్లాడుతూ పాన్ ఇండియా కాదు అది పాన్ వరల్డ్ మూవీ అని చెప్పారు" అంటూ సోహెల్ అన్నాడు. ఇక సోహెల్ వ్యాఖ్యలతో 'RC16' పై అంచనాలు తారస్థాయికి చేరాయి.ఈ ప్రాజెక్టు వచ్చే నెలలో పూజా కార్యక్రమాలు జరుపుకోబోతోంది. మార్చి రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. కొద్దిరోజుల షూటింగ్ తర్వాత 'RC16' నుంచి చిన్న వీడియో గ్లింప్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ మునిపెన్నోడు కనిపించని డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. ఈ 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: