డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. ఆ సినిమాకు సీక్వెల్ తీయబోతున్నాడా?

praveen
సౌత్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు ఉన్నారు. ఇక తమదైన శైలిలో సినిమాలు చేస్తూ సూపర్ హిట్లు కొడుతూ ఉన్నారు. అయితే ఇక వందల కోట్ల ఖర్చు పెట్టి కమర్షియల్ హాంగులతో సినిమాలు తీసే డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి సినిమాలు కొన్ని ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అయితే.. ఇంకోన్ని సినిమాలు మాత్రం రికార్డు స్థాయి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే కమర్షియల్ హాంగుల జోలికి పోనీ డైరెక్టర్లు ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారా అంటే ముందుగా శేఖర్ కమ్ముల పేరు గుర్తుకు వస్తూ ఉంటుంది.

 ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు శేఖర్ కమ్ముల. ఇక ఎలాగూ స్టార్ డం వచ్చేసింది కదా.. వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీయాలి అని ఆయన ఎప్పటికీ అనుకోరు. ఆయనలోని ప్రత్యేకమైన దర్శకత్వ శైలి అందరిలో కెల్లా ఆయనను ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టింది. ఫీల్ గుడ్ మూవీస్ కి కేరాఫ్ అడ్రెస్ గా కొనసాగుతూ ఉంటారు శేఖర్ కమ్ముల. ఇక నాచురాలిటీకి దగ్గరగా ఆయన సినిమాలు ఉంటాయి. ఇక ఆయన సినిమాల్లో ఫైటింగ్ సీన్లు, ఐటమ్ సాంగ్లు, రొమాంటిక్ సన్నివేశాలు ఇలాంటివి ఏమీ కనిపించవు. కానీ ఆయన దర్శకత్వంలో ఓ మూవీ వచ్చింది అంటే చాలు అటు ప్రేక్షకులు అందరూ కూడా థియేటర్కు బారులు తీరుతుంటారు.

 అయితే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నేటితరం రాజకీయాలపై వచ్చి సూపర్ హిట్ సాధించిన సినిమా లీడర్. ఏకంగా దగ్గుబాటి రానా ఈ మూవీలో హీరోగా నటించాడు. ఈ సినిమా ఇప్పటికీ కూడా ప్రేక్షకులకు తెగ కనెక్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ మూవీ గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఏకంగా లీడర్ సినిమాకు సీక్వెల్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మరోసారి రానా, శేఖర్ కమ్ముల లీడర్ 2 కోసం కలిసి పని చేయబోతున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ప్రస్తుతం రానా గుణశేఖర్ తో హిరణ్యకశ్యక, తేజ తో రాక్షస రాజ సినిమాలతో బిజీగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: