'అంబాజీ పేట మ్యారేజి బ్యాండు' సినిమాపై రౌడీ హీరో రివ్యూ

Anilkumar
'కలర్ ఫోటో’ చిత్రంతో టాలీవుడ్ కి హీరోగా పరిచయం అయ్యాడు సుహాస్. తొలి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా ఏకంగా జాతీయ అవార్డును సైతం అందుకుంది. ఆ తర్వాత 'రైటర్ పద్మభూషణ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. ముఖ్యంగా మహిళలను బాగా ఆకట్టుకుంది. హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ రాణిస్తున్నాడు. రీసెంట్ టైమ్స్ లో వచ్చిన అడివి శేష్ 'హిట్ 2' చిత్రంలో నెగెటివ్ రోల్ పోషించి అలరించాడు ఇక ఇప్పుడు 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు. 

కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహించారు  ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ మంచి రెస్పాన్స్ అందుకోగా.. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. ఈ సందర్భంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు' సినిమా చూసి తన రివ్యూ ఇచ్చారు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమాని సపోర్ట్ చేస్తూ తాజాగా హైదరాబాదులో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా బీఫ్ టికెట్ రిలీజ్ చేశారు ఇక ఈ సినిమాను చూసి చాలా బాగుందంటూ ప్రశంసించారు "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా చూశాను. 

ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది. మ్యూజిక్, ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ లు నెక్ట్ లెవెల్ లో ఉన్నాయి. సుహాస్ ఎప్పటిలాగా చాలా బాగా నటించాడు. శరణ్య అద్భుతంగా పర్ ఫార్మ్ చేసింది. ఏ సినిమాకైనా ఫస్ట్ హాఫ్ చూశాక కొంత విరామం తీసుకునే నేను ఈ సినిమాకు కంటిన్యూగా ఫుల్ మూవీ చూశాను. అంత క్యూరియస్ గా అనిపించింది. మీరు కూడా థియేటర్ లో ఇదే ఫీల్ అవుతారు" అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాపై రౌడీ హీరో కామెంట్స్ మరింత అంచనాలను పెంచాయి.
కంప్లీట్ విలేజ్ నేటివిటీతో ఎమోషనల్ లవ్ స్టోరీ గా తెలకెక్కిన ఈ చిత్రంలో సుహాస్ సరసన శివాని నాగారం హీరోయిన్గా నటిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: