గాంజా శంకర్ చుట్టూ సమాధానం లేని ప్రశ్నలు !

Seetha Sailaja
త సంవత్సరం ‘విరూపాక్ష’ తో సూపర్ హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ ఆతరువాత సినిమాల విషయంలో చాల నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. తన వద్దకు చాలామంది దర్శక నిర్మాతలు సాయి తేజ్ డేట్స్ గురించి ఎదురు చూస్తున్నప్పటికీ సాయి ధరమ్ తేజ్ ఈవిషయంలో మౌనం వహిస్తున్నాడు అంటూ కొందరి అభిప్రాయం.

ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న మూవీకి ‘గాంజా శంకర్’ అన్న పేరు పెట్టడంతో మెగా అభిమానులతో పాటు మెగా కాంపౌండ్ కూడ ఆనంద పడినట్లు టాక్. ఈసినిమాను నిర్మాత నాగవంశీ తీయడంతో ఈమూవీకి సంబంధించిన లీకులు ఫిలిం ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్నాయి. ఈమూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డే ను సంప్రదించినప్పటికీ ఆమె తన మౌన ముద్రను వీడటం లేదు అన్న సంకేతాలు వస్తున్నాయి.

వాస్తవానికి నిర్మాత నాగ వంశీ ఈమూవీ గురించి ఎటువంటి లీకులు ఇవ్వకపోవడంతో ఈసినిమా అనుకున్న డేట్ కు రిలీజ్ అవుతుందా లేదా అన్న సందేహాలు తేజ్ అభిమానులలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈమూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి మరొక షాకింగ్ గాసిప్ ప్రస్తుతం హడావిడి చేస్తోంది. భారీ బడ్జెట్ తో తీయబోతున్న ఈమూవీ కథలో సంపత్ నంది చేసిన మార్పులకు సాయి తేజ్ నుండి ఇంకా ఎలాంటి స్పందన పూర్తిగా రాలేదా అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి.

దీనికితోడు ఈసినిమాను నిర్మిస్తున్న నాగవంశీ కూడ ఈసినిమాకు సంబంధించి ఎటువంటి అప్ డేట్స్ కూడ చాలామందికి తెలియక పోవడంతో వాస్తవానికి ఈసినిమా షూటింగ్ జరుగుతోందా లేదంటే ఈమూవీ కథలో కాని బడ్జెట్ లో కానీ వచ్చిన మార్పులు వల్ల ఈమూవీ షూటింగ్ అప్ డేట్స్ పై క్లారిటీ లేదా అన్న సందేహాలు కొందరికి కలుగుతున్నాయి. సాయి తేజ్ నటించిన ‘విరూపాక్ష’ సూపర్ సక్సస్ అయినప్పటికీ తేజ్ మార్కెట్ పెరగక పోవటంతో ‘గాంజా శంకర్’ మూవీ బడ్జెట్ పై ఆచితూచి నిర్మాతలు వ్యవహరించడంతో దర్శకుడు సంపత్ నంది ఈమూవీ మేకింగ్ విషయంలో నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: