పాపం.. ఈసారి పుష్ప 2 నుండి మెయిన్ సీన్ లీక్..!?

Anilkumar
ఎంత పెద్ద సినిమా చేసాము అన్నది కాదు ఆ సినిమాను విడుదల అయ్యేంతవరకు కాపాడుకోవడమే ఇప్పుడు అందరికీ ఒక పెద్ద టాస్క్ గా మారిపోయింది  షూటింగ్ మొదలైనప్పటి నుండి ఆ సినిమాకి లీక్ ల బెడత అస్సలు తగ్గడం లేదు. తాజాగా ఇప్పుడు పుష్ప 2 సినిమాకి సంబంధించి ఒక లీక్ జరిగింది అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక పుష్ప సినిమాకి ఇదే మొదటిసారి ఏమీ కాదు. ఆ మధ్య వైజాగ్ లో జరిగిన షూటింగ్ అప్పుడు ఆ తర్వాత మారేడుమిల్లీ షూట్ వీడియో ఇలా పలు రకాల వీడియోలు లీక్ అయ్యాయి. ఇప్పుడు మరొకసారి అదే జరిగింది.

గత కొద్దిరోజులుగా పుష్పా సినిమాకి ఎటువంటి బ్రేకులు లేకుండా షూటింగ్ చేస్తున్నారు. అల్లు అర్జున్ నా లేకపోయినప్పటికీ సుకుమార్ షూట్ మాత్రం ఆపడం లేదు. ప్రస్తుతం rfc లోనే పుష్ప  కి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నారు. అయితే అంతా బాగానే ఉంది అని అనుకునే లోపే ఆ స్పాట్ నుండి అల్లు అర్జున్కి సంబంధించిన చీరలో ఉన్న ఒక ఫోటోని లీక్ చేశారు. లీక్ అయిన నెక్స్ట్ సెకండ్ నుండి ఆ ఫోటో సోషల్ మీడియాని షేక్ చేసింది. పుష్ప 2 ఇంటర్వెల్ సీన్‌లో భాగంగా గంగమ్మ జాతర సీన్ షూట్ చేస్తున్నారు సుకుమార్.

ఈ సీక్వెన్స్‌లో అల్లు అర్జున్ చీరలో ఉంటారని తెలుస్తుంది. అదే ఇదా అనే సందేహాలు ఇప్పుడొస్తున్నాయి. ఇదిలా ఉంటే గతంలోనూ నిమిషానికి పైగానే నిడివి ఉన్న గంధపుచెక్కల స్మగ్లింగ్ సీన్ లీక్ అయింది. ఈ విషయంలో పుష్ప 2 మేకర్స్ సీరియస్‌గా ఉన్నారు. లీక్ చేసిందెవరైనా లీగల్‌గా వెళ్లాలని చూస్తున్నారు వాళ్లు. పుష్ప పార్ట్ 1కు కూడా లీక్స్ తప్పలేదు. అప్పట్లో దాక్కో దాక్కో మేక పాటను కొందరు మొబైల్‌లో తీసి లీక్ చేసిన వీడియో వైరల్ అయింది. ఇక పుష్ప 2కి కూడా మొదట్నుంచి లీక్ బెడద తప్పట్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: