నిర్మాతలకు వరంగా నాని కథల ఎంపిక..!

Anilkumar
నాచురల్ స్టార్ నాని గత ఏడాది దసరా, హాయ్ నాన్న వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా నాని విభిన్న తరహా కథలు ఎంచుకొని డిఫరెంట్ రోల్స్ లో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. హిట్టు, ప్లాప్స్ తో సంబంధం లేకుండా ఇప్పటివరకు సినిమా సినిమాకి కొత్తదనాన్ని చూపిస్తూ వచ్చాడు. అందరి హీరోల్లా కాకుండా కంటెంట్ ఉన్న కథలు ఎంచుకొని మీడియం రేంజ్ బడ్జెట్ లోనే సినిమాలు చేసి నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నాడు. ప్రస్తుత కాలంలో మీడియం బడ్జెట్ సినిమాల షాటిలైట్ బిజినెస్త తగ్గుముఖం పట్టడంతో నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

వీటితో పాటు థియేట్రికల్, ఓటీటీ బిజినెస్ కూడా మునుపటిలా భారీగా జరగడం లేదు. అందుకే మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మొత్తాన్ని రికవరీ చేసేందుకు కష్టపడుతున్నాయి. కొంతమంది నిర్మాతలు మీడియం రేంజ్ హీరోలతో భారీ బడ్జెట్ పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు. కానీ నాని విషయంలో మాత్రం అలా కాదు. కొన్నాళ్లుగా నాని సినిమాలు భారీ బిజినెస్ చేస్తున్నాయి. స్టార్ డైరెక్టర్స్ కాంబినేషన్ లేకుండానే నాని సినిమాలకు మంచి బిజినెస్ జరుగుతూ వస్తోంది. అందుకు కారణం నాని స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న కథలు ఎంచుకొని సినిమాలు చేస్తుండడమే. మాస్, క్లాస్ అని తేడా లేకుండా అన్ని వర్గాల ఆడియన్స్ ని థియేటర్స్ రప్పించేందుకు

నాని బాక్సాఫీస్ దగ్గర తనకంటూ మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నాడు. ఇక ప్రస్తుతం నాని సినిమాల డిజిటల్ రైట్స్ కొనేందుకు పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ భారీ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇటీవల నాని 'హాయ్ నాన్న నెట్ ఫ్లిక్స్ లో రిలీజై అన్ని భాషల్లో భారీ రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా హిందీ, తెలుగు వర్షన్స్ టాప్ 10 ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇక ఇదే నెట్ ఫిక్స్ నాని లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం' ఓటీటీ రైట్స్ ని ఏకంగా 45 కోట్లకు కొనుగోలు చేసింది. నాని కెరియర్ లోనే ఇది రికార్డ్ అని చెప్పొచ్చు. డిజిటల్ రైట్స్ మాత్రమే కాదు ఈ సినిమా థియేట్రికల్, నాన్- థియేట్రికల్ రైట్స్ కి సైతం భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: