సుకుమార్ ది ఫ్యామిలీ మెన్..!

shami
సినిమాలతో బిజీ బిజీగా ఉండే డైరెక్టర్స్ తమ ఫ్యామిలీతో సరైన సమయం గడిపే అవకాశం ఉండదు. అందుకే సినిమా రిలీజ్ కాగానే కొంత గ్యాప్ తీసుకుని వెకేషన్ కి వెళ్లి వస్తుంటారు. హీరోల పరిస్థితి కూడా అదే ఇప్పుడు డైరెక్టర్స్ పరిస్థితి కూడా అదేలా ఉంది. అయితే ఫ్యామిలీకి తగిన టైం ని వారికి ఉన్న ఫ్రీ టైం లోనే ఇస్తున్నారు. లేటెస్ట్ గా పుష్ప మేకర్ సుకుమార్ తన ఫ్యామిలీతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి.
సుకుమార్ ఆయన భార్య తబిత ఇద్దరు పిల్లలు సరదాగా గడిపిన క్షణాలు సుక్కు వైఫ్ తబిత సుకుమార్ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె చేసిన ఈ ఫోటోలు సుకుమార్ ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సుకుమార్ ది ఫ్యామిలీ మెన్ అంటూ ఆ ఫోటోలకు కామెంట్స్ కూడా చేస్తున్నారు. అయితే సుకుమార్ కూతురు దాదాపు టీనేజ్ కి వచ్చినట్టు ఉంది. ఇదివరకు ఎప్పుడు సుకుమార్ పిల్లల ఫోటోలు బయటకు రాలేదు. ఇప్పుడు వారిని చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు.
సుకుమార్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా చేస్తున్నారు. పుష్ప 1 సెన్సేషనల్ హిట్ కాగా పుష్ప 2 పై భారీ హోప్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ మరోసారి నట విశ్వరూపం చూపించేందుకు రెడీ అవుతున్నాడు. పుష్ప 2 ఆగష్టు 15న ఎలాగైనా రిలీజ్ చేసేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో కానీ రాం చరణ్ తో కానీ సుకుమార్ సినిమా ఉంటుందని టాక్. సుకుమార్ పుష్ప 2 పూర్తయ్యాక ఒక రెండు మూడు నెలలు గ్యాప్ ఇచ్చి తన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేయాలని చూస్తున్నారు. మరి సుకుమార్ నెక్స్ట్ చిరుతో ఉంటుందా లేదా మరో హీరోతో చేస్తాడా అన్నది పుష్ప తర్వాతే తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: