సీనియర్ హీరోలందరు ఆ హీరోయిన్ మీద కన్నేశారా..?

shami
సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో సైలెంట్ హిట్ అందుకుంది నాగార్జున నా సామిరంగ. ఈ సినిమా పర్ఫెక్ట్ ఫెస్టివల్ మూవీగా వచ్చి సూపర్ వసూళ్లను రాబట్టింది. చాలా కాలం తర్వాత నాగ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర లాభాల బాట పట్టింది. విజయ్ బిన్ని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో నాగార్జున తో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ నటించారు. అయితే ఈ సినిమాలో కన్నడ భామ ఆషిక రంగనాథ్ నటించింది. అంతకుముందు కళ్యాణ్ రాం తో అమిగోస్ సినిమా చేసిన ఆషిక ఆ సినిమా ఫ్లాప్ అయిన నా సామిరంగతో హిట్ అందుకుంది.
నా సామిరంగ సినిమాలో అమ్మడి నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆషిక టాలెంట్ చూసి వావ్ అనేస్తున్నారు. అయితే సీనియర్ హీరో అయినా సరే నాగార్జున పక్కన నటించేందుకు ఏమాత్రం ఆలోచించని ఆషిక గురించి ఇప్పుడు ఇండాస్ట్రీ అంతా కూడా స్పెషల్ గా మాట్లాడుకుంటున్నారు. సీనియర్ హీరోలకు ఆమె పర్ఫెక్ట్ ఆప్షన్ అని.. ఇక మీదట సీనియర్ హీరోలకు హీరోయిన్ లేదని బాధపడాల్సిన అవసరం లేదని అంటున్నారు.
ముఖ్యంగా సీనియర్ హీరోలైన చిరు, బాలకృష్ణ, వెంకటేష్ నాగార్జునలు తమ సినిమాల్లో తమతో కలిసి నటించే హీరోయిన్స్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే నా సామిరంగలో ఆషిక ని చూశాక ఆమె అయితే ఇక ఆలోచించాల్సిన పనిలేదని అంటున్నారు. ఆషిక కూడా ఛాన్స్ రావాలే కానీ సీనియర్ జూనియర్ అనే తేడాలేవి లేవని అంటుంది. మొత్తానికి కన్నడ పరిశ్రమ నుంచి మరో కొత్త భామ టాలీవుడ్ లో పాగా వేసేందుకు వచ్చిందని చెప్పొచ్చు. నా సామిరంగ తర్వాత ఆషిక ఏ సినిమా చేస్తుందో తెలియాల్సి ఉంది. మరో సాలిడ్ హిట్ పడితే మాత్రం ఆషిక ఇక తెలుగులో సూపర్ ఫాం కొనసాగించే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: