ఆ హీరోయిన్ బయోపిక్ లో నటించాలని ఉంది : రష్మిక

praveen
ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉంది రష్మిక మందన్న. చలో అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేస్ లోకి వచ్చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక తన అందం అభినయంతో కుర్ర కారు మతి పోగొట్టి మంచి గుర్తింపుని సంపాదించుకుంది. అయితే కెరియర్ మొదట్లో ఈ అమ్మడి పట్టుకుందల్లా బంగారం అన్నట్లుగా చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అయింది అని చెప్పాలి. దీంతో రష్మిక మందన్న ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు.

 అయితే ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ వరుసగా అవకాశాలు అందుకుంటూనే ఇక బాలీవుడ్ లో కూడా బాగా వేయాలని ప్రయత్నిస్తుంది ఈ ముద్దుగుమ్మ. మొన్నటికి మొన్న బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ సరసన యానిమల్ అనే సినిమాలో నటించింది. ఇక ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో అటు తెలుగులో బన్నీ సరసన పుష్ప 2లో నటిస్తుంది రష్మిక. ఈ మూవీపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇటీవల ఒక దివంగత హీరోయిన్ బయోపిక్ లో నటించాలని ఉంది అంటూ మనసులో మాట బయట రష్మిక మందన్న.

 ఆ హీరోయిన్ ఎవరో కాదు ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా హవా నడిపించిన దివంగత నటి సౌందర్య. దాదాపు దశాబ్ద కాలం పాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన ఆమె.. దురదృష్టవశాత్తు విమాన ప్రమాదంలో చనిపోయారు. కాగా సౌందర్య బయోపిక్ లో నటించాలని ఉంది అంటూ ఇటీవలే చెప్పుకొచ్చింది రష్మిక మందన. అలనాటి స్టార్ హీరోయిన్ సౌందర్య అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు నన్ను కుటుంబ సభ్యులంతా సౌందర్యలా ఉంటావు అని అనేవారు. ఇక చిన్నప్పటినుంచి ఆమె నటన చూస్తూనే పెరిగాను. ఇక ఆమె బయోపిక్ లో నటించాలని ఎప్పటి నుంచి కోరిక ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: