'రంగస్థలం' కాంబో రిపీట్..!

Anilkumar
'RRR' తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత తన రాబోయే సినిమాలను కూడా అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఇప్పుటికే గేమ్ ఛేంజర్, బుచ్చిబాబు సినిమాలకు కమిట్ అయిన రామ్ చరణ్ ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో మరోసారి సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'రంగస్థలం' సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ సినిమా చరణ్ కెరియర్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. అప్పటి నుంచి ఈ కాంబోలో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని 

అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇక ఎట్టకేలకు ఆ సమయం రానే వచ్చింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు ముగింపు దశకి చేరుకుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాతి సినిమాను బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్నాడు. 'RC16' అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ ప్రాజెక్టు మార్చ్ నుంచి పట్టాలెక్కనుంది. ఇక ఈ ప్రాజెక్టు పూర్తయిన వెంటనే సుకుమార్ తో తన 17వ సినిమాని చేయబోతున్నారట రామ్ చరణ్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయినట్లు సమాచారం.

 అంతేకాకుండా అక్టోబర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ కానుందని అంటున్నారు. బుచ్చిబాబు సినిమా పూర్తయిన వెంటనే సుకుమార్ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. రంగస్థలం లో ఓ కొత్త రామ్ చరణ్ ని చూపించిన సుకుమార్ ఈసారి చరణ్ ని ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తారో చూడాలి. ఇక సుకుమార్ ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్ పూర్తిచేసే పనిలో ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: