బిగ్ బాస్ లో దారుణమైన టాస్క్.. ఎంత ఘోరంగా హింసించారో చూడండి?
ఇలాంటి టాస్కులతోనే ఇక ఇక ప్రేక్షకులను అలరించడమే కాదు ఇక రేటింగ్ కూడా సొంతం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే బిగ్బాస్ షో ఏ భాషలో ప్రసారమవుతున్న ఇక ప్రతివారం తప్పకుండా నామినేషన్స్ ప్రక్రియ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఇలాంటి నామినేషన్స్ తో కొంతమందిని ఎంచుకొని ఇక వారిని హౌస్ నుంచి బయటికి పంపేందుకు నామినేట్ చేస్తూ ఉంటారు. ఇక బిగ్ బాస్ చెప్పిన విధంగానే ఇలాంటి నామినేషన్ ప్రక్రియను కొనసాగించాల్సి ఉంటుంది. అయితే కొన్ని కొన్ని సార్లు బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు ఏకంగా తీవ్ర విమర్శలకు దారితీస్తూ ఉంటాయి అని చెప్పాలి.
ఇక ఇటీవల హిందీ బిగ్ బాస్ లో కూడా ఇలాంటిదే జరిగింది. ఏకంగా ఒక మనిషిని ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా టాస్క్ పేరుతో హింసించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. బిగ్బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ని రెండు గ్రూపులుగా విభజించి టాస్కులు పెట్టారు. టాప్ ఫైవ్ లిస్టులో ఉంటారు అని అనుకున్న వారిని నలుగురిని ఒక టీంలో బిగ్ బాస్ ఉంచాడు. ఇక నలుగురిని రెండు జంటలుగా ఉంచాడు. అయితే ఈ టాస్క్ లో భాగంగా బజర్ ని నొక్కి పట్టుకున్నంత సేపు లైట్ వెలుగుతుంది. బజర్ నుంచి చేయి తీసేస్తే లైట్ ఆఫ్ అయిపోతుంది. ఎవరు ఎంత సమయం పాటు బజర్ నొక్కి పట్టుకుంటారనేది టాస్క్. ఈక్రమంలోనే వారిని చెడగొట్టేందుకు మిగతా కంటెస్టెంట్స్ ప్రయత్నించాలి. ఈ క్రమంలోనే ఈ టాస్క్ లో భాగంగా మహిళా కంటెస్టెంట్ ని మిగతా కంటెస్టెంట్స్ అందరూ కూడా తీవ్రంగా వేధింపులకు గురి చేశారు. ఇక ఈ వీడియో వైరల్ గా మారిపోవడంతో బిగ్ బాస్ టాస్క్ పేరుతో ఇంత దారుణంగా హింసించాలా అంటూ ఎంతో మంది కామెంట్లు చేస్తున్నారు.