3 రోజుల్లో 25 కోట్లు.. ఇది నాగార్జున మాస్ వీరంగం..!

shami
కింగ్ నాగార్జున సంక్రాంతి సీజన్ అంటే చాలు బాక్సాఫీస్ దగ్గర రెచ్చిపోతున్నాడు. సంక్రాంతికి తక్కువ అంచనాలతో వచ్చిన నాగార్జున నా సామిరంగ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్లతో అదరగొట్టేస్తుంది. నూతన దర్శకుడు విజయ్ బిన్నితో నాగార్జున చేసిన ఈ ప్రయోగం సఫలమైందని చెప్పొచ్చు. మలయాళంలో సూపర్ హిట్టైన పొరింజు మరియం జోస్ సినిమా రీమేక్ గా నాగార్జున నా సామిరంగ సినిమా చేశారు. ఈ సినిమా మాతృక కథ మాత్రమే తీసుకుని తెలుగు నేటివిటీకి తగినట్టుగా కథని మార్చారు.
సినిమాలో నాగార్జునతో పాటుగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా నటించారు. సంక్రాంతి సందర్భంగా అన్నిటి కన్నా చివరి రోజు రిలీజైన నా సామిరంగ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఓ పక్క హనుమాన్ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంటే ఆ తర్వాత నాగార్జున నా సామిరంగ కూడా కలెక్షన్స్ కుమ్మేస్తుంది. ఈ సినిమా ఆదివారం రిలీజ్ కాగా ఆది, సోమ, మంగళవారాల్లో 24.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అదుర్స్ అనిపించింది.
కేవలం 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన నాగార్జున నా సామిరంగ సినిమా 3 రోజుల్లో 25 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అదుర్స్ అనిపించింది. సంక్రాంతి సీజన్ అంటే ఫ్యామిలీ మొత్తం చూసే సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని నాగార్జున పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి నిజం చేశారు తెలుగు ఆడియన్స్. ఈ సినిమా విషయంలో నాగార్జున మొదటి నుంచి సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉండగా ఆయన నమ్మకం ఇలా ప్రూవ్ అయ్యింది. రిస్క్ అని తెలిసినా నాగార్జున మొదటి నుంచి నా సామిరంగ విషయంలో చాలా డేర్ గా ఉన్నారు. సంక్రాంతికి హిట్టు కొడుతున్నామని బలంగా నమ్మారు. చెప్పినట్టుగానే సూపర్ హిట్ కొట్టారు. అక్కినేని ఫ్యాన్స్ అంతా నా సామిరంగ హిట్ తో ఫుల్ ఖుషిగా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: