వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయిన "స్కంద" మూవీ..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ నటులలో ఒకరు అయినటువంటి రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు తాజాగా స్కంద అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి తెలుగు సినీ పరిశ్రమలో మాస్ దర్శకుడిగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ... శ్రీ లీల , సాయి మంజ్రేకర్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు.

 ఇకపోతే ఈ సినిమాలో రామ్ డ్యూయల్ రోల్ లో నటించి రెండు పాత్రలలోనూ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఇకపోతే భారీ అంచనాలు నడుమ పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా కొన్ని రోజుల క్రితం నుండే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ మూవీ కి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మాత్రం ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మరి కొన్ని రోజుల్లో స్టార్ మా చానల్లో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: