చుట్టుముట్టిన అభిమానులు.. రష్మిక చేసిన పనికి అందరూ షాక్?

praveen
నేషనల్ క్రష్ గా గుర్తింపును సంపాదించుకుని కుర్ర కారు హృదయాన్ని దోచేసిన ముద్దుగుమ్మ రష్మిక మందన. ప్రస్తుతం కెరియర్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా అవకాశాలు అందుకుంటూ ఇక పాన్ ఇండియా హీరోయిన్గా హవా నడిపిస్తుంది. ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ సరసన నటించిన యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో రష్మికకు బోలెడన్ని అవకాశాలు తలుపు తడుతూ ఉన్నాయి అని చెప్పాలి.

 అయితే ఇటీవల యానిమల్ సక్సెస్ మీట్ నిర్వహించారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళింది. రష్మిక మందన్న అయితే ఇటీవల కాలంలో తమ అభిమాన సెలబ్రిటీలు ఎక్కడికైనా వస్తున్నారు అంటే చాలు అభిమానులు అందరూ కూడా అక్కడికి భారీగా తరలి రావడం చేస్తూ వున్నారు. ఇక తమ ఫేవరెట్ హీరోయిన్స్ తో ఒక్క ఫోటో అయిన దొరక్క పోతుందా అని ఎంతో నిరీక్షణగా ఎదురు చూస్తూ ఉన్నారు. కొంత మంది అయితే కాస్త అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు అని చెప్పాలి. యానిమల్ సక్సెస్ మీట్ కి హాజరైన రష్మికకు అభిమానుల నుంచి ఇలాంటి అనుభవం ఎదురైంది.

 రష్మిక కోసం భారీగా తరలివచ్చిన జనాలు ఆమెతో సెల్ఫీ దిగాలని ఎంతగానో ఆశపడ్డారు. ఈ క్రమంలోనే అభిమానులు ఆమెకు దగ్గరగా వస్తున్న సమయంలో ఆమె చివరికి పరుగులు పెట్టారు. భారీగా ఫ్యాన్స్ చుట్టుముట్టడంతో తెగ కంగారు పడిపోయింది రష్మిక. ఈ క్రమంలోనే హడావిడిలో తన కారుకు బదులు మరో కారు ఎక్కబోయింది. దీంతో వెంటనే స్పందించిన టీం మేడం అది మన కారు కాదు అంటూ అలర్ట్ చేయడంతో మళ్లీ తన కారు వైపుకు పరుగులు తీసింది రష్మిక. ఇక చివర్లో ఇద్దరు ముగ్గురికి ఫోటోలు ఇచ్చి అభిమానులను సంతృప్తి పరిచింది ఈ అమ్మడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: