డైరెక్టర్ వివి వినాయిక్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన బ్రదర్..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ వివి వినాయక్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు.. ఈయన గతంలో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలను తెరకెక్కించి ఎంతోమంది హీరోలకు లైఫ్ ఇచ్చారు.. ఇటీవల కాలంలో అవకాశాలు తగ్గినప్పటికీ అడపా దడపా సినిమాలు చేస్తూ ఉన్న సక్సెస్ కాలేకపోతున్నాయి.. గత కొన్నేళ్లుగా ఈయన ఎలాంటి సినిమాలను కూడా తెరకెక్కించలేదు..ఈ నేపథ్యంలోనే అసలు ఈయన ఏం చేస్తున్నారు అనే విషయం చర్చనీయాంశంగా మారుతోంది. ఇప్పుడు తాజాగా రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.వైసిపి ఎంపీగా బరిలోకి దిగబోతున్నట్లు ఒక వార్త వైరల్ గా మారింది.

అసలే ఎన్నికలు ఫీట్ చాలా వైరల్ గా మారడంతో ఈ వార్తలకి మరింత  ముడిపడే విధంగా కాకినాడలో జరిగిన ఒక పెళ్లికి వినాయక్ తో సహా ఏపీ సీఎం వెళ్లడంతో మరింత ఆసక్తికరనీయంగా మారుతోంది. మరి వినాయక్ పొలిటికల్ ఎంట్రీ నిజమా కాదా అనే విధంగా ఆయన సోదరుడు క్లారిటీ ఇచ్చారు.. ఈ విషయం పైన వినాయక సోదరుడు మాట్లాడుతూ ఇదంతా కేవలం ప్రచారంలోనే భాగం మాత్రమే ఇందులో ఎలాంటి వాస్తవం లేదని తెలియజేశారు. తమకి ఏ పార్టీని వారు సంప్రదించలేదని.. అలాగే తమ సోదరుడు ఒకరు ycp లో మాత్రమే ఉన్నారని కానీ మిగిలిన ఎవరికి రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదంటూ ఖండించారు.

ఇటీవలే తాము కాకినాడ పెళ్లికి వెళ్ళాము అక్కడ సీఎం జగన్ గారు కూడా వచ్చారు.. అక్కడ ఎవరి పనులు వారు చూసుకొని వెళ్ళిపోయాము తప్పా ఎటువంటి నాయకులను కలిసింది లేదు అంటూ తెలియజేశారు. మొత్తానికి వినాయక్ పొలిటికల్ ఎంట్రీ పైన ఆయన సోదరుడు క్లారిటీ ఇవ్వడం జరిగింది.. అయితే ప్రస్తుతం డైరెక్టర్ వివి వినాయక్ ఒక సినిమా పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి కూడా ఆయనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని వార్తలు వినిపిస్తున్నాయి చివరిగా హిందీలో చత్రపతి అనే సినిమాని రీమిక్స్ చేసి భారీ డిజాస్టర్ ని మూట కట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: