ఆసక్తి రేపుతున్న అయలాన్ మూవీ ట్రైలర్..!!
సైన్స్ ఫిక్షన్ డ్రామా గా రూపొందించిన అయలాన్ సినిమా భారీ విజువల్ తో తెరకెక్కించారు. ట్రైలర్ విషయానికి వస్తే మొదట ఈ ట్రైలర్ కూల్ గా నేచురల్ విజువల్స్ తో మొదలవుతుంది.. ఈ భూమి మీద ఎన్నో జీవరాశులు చోటు ఉంటుందని చెప్పడంతో ఈ సినిమా ట్రైలర్ మొదలవుతుంది. ఈ సినిమా విజువల్స్ కూడా అద్భుతంగా సాగుతున్నాయని చెప్పవచ్చు.. సడన్గా ఒక ఏలియన్ భూమి మీదికి దిగుతుంది.. ఈ ఏలియన్ వల్ల శివ కార్తికేయన్ లైఫ్ లో ఏం జరుగుతుంది.. అనేకదాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు..ఏలియన్ తో కలిసి శివ కార్తికేయన్ చేసిన సందడి ఎలా ఉంటుందని విషయం తెలియాలి అంటే సినిమా వచ్చేవరకు ఆగాల్సిందే.
అయితే ఏలియన్ తో చేసిన కామెడీ ట్రైలర్లు అయితే ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.. విలన్ సృష్టించే విధ్వంసాన్ని ఏలియన్ తో కలిసి హీరో ఎలా అంతమందించారని కథ అన్నట్లుగా ఈ సినిమా ట్రైలర్ కనిపిస్తోంది.. ఇందులో హీరోయిన్ గా రకుల్ ప్రీతిసింగ్ నటించగా ఈ చిత్రానికి సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ అందించారు. కామెడీ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కించిన అయలాన్ చిత్రం ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.