గీతాంజలి సీక్వెల్ విలన్ గా సునీల్..!!

Divya
చాలా ఇండస్ట్రీలో ఎక్కువగా సీక్వెల్ ట్రెండ్ కొనసాగుతోంది.అందుకే ఎప్పుడో విడుదలైన చిత్రాలకు కూడా సీక్వెల్స్ ను తెరకెక్కిస్తూ ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారు డైరెక్టర్లు.. ఈ నేపథ్యంలోనే 2014లో అంజలి హీరోయిన్గా నటించిన హర్రర్ మూవీ గీతాంజలి విడుదలై 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు సీక్వెల్ సిద్ధమవుతోంది.. ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రాన్ని గీతాంజలి మళ్లీ వచ్చిందని స్పెషల్ పోస్టర్ని సైతం చిత్ర బృందం విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ సైతం విడుదల చేయడం జరిగింది.

ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో కమెడియన్ విలన్ సునీల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది ఇందులో కూడా సునీల్ నాని అనే ఒక కిల్లర్ విలన్ గా నటించబోతున్నట్లు తన క్యారెక్టర్ కి సంబంధించి చిత్ర బృందం ఇటీవల ఒక పోస్టర్ని ప్రకటించింది.. ఈ పోస్టర్లో సునీల్ ఒక వాంటెడ్ భవనం ముందు హాకీ స్టిక్ పట్టుకొని నిలుచున్నట్లుగా కనిపిస్తోంది ఈ పోస్టర్తో ఈ సినిమా పైన మరింత అంచనాలను పెంచేసేలా కనిపిస్తున్నాయి.. గీతాంజలి మళ్లీ వచ్చింది అనే చిత్రం అంజలి కెరియర్ లోనే 50వ సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తి అయ్యిందంటూ మేకర్స్ తెలుపుతున్నారు. అందుకే న్యూ ఇయర్ సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్ను సైతం రిలీజ్ చేశారు.. ఆ పోస్టర్లు అంజలి ఒక క్లాసికల్ డాన్స్ చేస్తున్నట్లుగా ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది.. ఈ చిత్రాన్ని కోనా వెంకట్ తో సహా పలువురు సహా నిర్మాతలు తెరకెక్కిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఈ సీక్వెల్ మొదటి భాగంలో నటించిన నటీనటులు కూడా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ తుర్లపాటి కొత్త దర్శకుడుగా పరిచయం కాబోతున్నారు. ప్రస్తుతం సునీల్ కి సంబంధించి ఈ పోస్టర్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: