బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల మార్కును సాధించడం కష్టమేనా..?

Divya
భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా డైరెక్టర్ పాన్ ఇండియా హీరో కాంబినేషన్లో సినిమాలు విడుదలవుతున్నాయి అంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని అభిమానుల సైతం భావిస్తూ ఉంటారు.. అయితే ఈ మధ్యకాలంలో బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల మార్కును అందుకోవడం అంత తేలికైన విషయం కాదన్నట్లుగా తెలుస్తోంది.ఇటీవల ప్రభాస్ పాన్ ఇండియా లేవల్లో విడుదల చేసిన సలార్ సినిమా 1000 కోట్ల మార్కు దాటుతుందని అందరూ అనుకున్నారు.. కానీ ప్రస్తుతం చూస్తే అలాంటి అవకాశం లేదని తెలుస్తోంది.

కేవలం 800 వందల కోట్ల రూపాయల మార్కును మాత్రమే అందుకునే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి.. సలార్ సినిమా వచ్చిన కలెక్షన్ ను చూసి తదుపరి చిత్రాలు 1000 కోట్ల మార్కును అందుకోవడం అంత తేలికైన పని కాదని చాలా క్లియర్ గా కనిపిస్తోంది. వాస్తవానికి పుష్ప-2 చిత్రం తప్ప మరే టాలీవుడ్ సినిమాలు కూడా ఈ ఏడాది 1000 కోట్ల మార్కుని అధిగమించే అవకాశాలు ఎక్కువగా కనిపించడం.. కానీ రాజమౌళి మరియు షారుక్ ఖాన్ సినిమాలు మాత్రమే వెయ్యికోట్ల మార్కులు అధికమించే అవకాశం ఉన్నది.

అది కూడా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను నిర్మిస్తేనే ఇలాంటివి జరుగుతాయని సినీ విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు. చాలామంది హీరోల సినిమాలు కేవలం పరంగా పాజిటివ్గా వస్తేనే కలెక్షన్స్ వచ్చేలా కనిపిస్తున్నాయి.. దీంతో మొదటి రోజు మాత్రం భారీగానే కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.. మరి పుష్ప-2 సినిమా 1000 కోట్ల మార్కును అధికమిచ్చి అభిమానులను ఆనందపరుస్తుందేమో చూడాలి మరి.. పుష్ప మొదటి భాగానికి భారీ రెస్పాన్స్ రావడంతో సీక్వెల్ పైన డైరెక్టర్ సుకుమార్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించాలని చాలా పగడ్బందీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. జాతీయ అవార్డు కూడా అల్లు అర్జున్ కు రావడంతో ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: