బజ్: అనుష్కకు సినిమాలు చేయడం ఇష్టం లేదా..!!
ప్రస్తుతం అనుష్క చిరంజీవి నటిస్తున్న 156వ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. జగదేకవీరుడు అతిలోకసుందరి తరహాలోనే ఈ చిత్రం ఉండబోతుందని డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. UV క్రియేషన్ బ్యానర్ పైన భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ఇందులో చిరంజీవికి జోడిగా అనుష్క అయితే ఓకే అన్నదని అందుకు కారణం UV బ్యానర్ కావడంతో ఒప్పుకున్నట్లు సమాచారం లేకపోతే ఈ సినిమా చేసే ఉద్దేశం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో చిరంజీవి అనుష్క కాంబినేషన్లో స్టాలిన్ చిత్రంలోని ఒక సాంగ్లో నటించారు.
మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అనుష్కకు చిరంజీవితో కలిసి నటించే అవకాశం అందుకుంది. ఈ సినిమాలో అనుష్క పాత్ర చాలా కీలకంగా ఉండడం వల్లే ఆమె ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. మొహమాటానికి అనుష్క ఈ చిత్రాన్ని చేస్తోంది కానీ ఆమె కెరియర్ కి పెద్దగా టర్నింగ్ పాయింట్ అయ్యేలా కనిపించలేదని టాక్ వినిపిస్తోంది.. అనుష్క సినిమాలకు దూరం అవుతాం అనుకుంటున్నా సమయానికి మేకర్స్ మాత్రం ఆమెను సినిమాలలో నటింపజేయాలని ప్రెషర్ ని ఎక్కువగా చేస్తూ ఉన్నట్లు సమాచారం..UV క్రియేషన్తో ఉన్న బాండింగ్ వల్ల ఈ అమ్మడు సినిమాలలో చేస్తోంది.. కానీ మిగతా సినిమాలు చేయదని వార్తలు వినిపిస్తున్నాయి. అభిమానులు మాత్రం అనుష్క పెళ్లి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.