పెళ్లి పీటలేక్కుతున్న రకుల్.. వెడ్డింగ్ డేట్ ఫిక్స్..!!

Divya
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరు పొందిన రకుల్ ప్రీతిసింగ్ త్వరలోనే వివాహం చేసుకోబోతోంది. తన ప్రియుడితో కలిసి ఏడు అడుగులు నడిచేందుకు సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానితో గత కొన్నేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ విషయాన్ని ఆమె పుట్టినరోజున ప్రకటించింది. ఇక అప్పటినుంచి రకుల్, జాకి ఇద్దరు కూడా కొన్ని రకాల పార్టీలు ఈవెంట్లకు ఫంక్షన్లకు సైతం జంటగా వెళుతూ ఉన్నారు. బాలీవుడ్ లో లవ్లీ కపుల్ గా పేరు పొందారు ఈ జంట.

త్వరలోనే తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న గోవాలో ఒక రిసార్ట్లో రకుల్- జాకీభగ్నా నిలు  వివాహం జరగబోతుందని పలు మీడియా కథనాలలో వార్తలు వినిపిస్తున్నాయి. వీరి పెళ్లి కేవలం కుటుంబ సభ్యులు స్నేహితులు సన్నిహితుల సమక్షంలోనే జరగబోతుందని తెలుస్తోంది. ఆ తర్వాత సినీ రాజకీయ ప్రముఖుల కోసం ఒక ప్రత్యేకమైన రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారట. ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ పెళ్లి వార్త మాత్రం చాలా హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ విషయం తెలిసి పలువురు అభిమానులు సైతం ఈ ముద్దుగుమ్మకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అయితే ఇప్పటివరకు రకుల్ గాని జాకీ గాని ఈ విషయం పైన ఎవరు స్పందించలేదు.అలాగే కుటుంబ సభ్యులు కూడా ఈ విషయాన్ని ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. రకుల్ ప్రీతిసింగ్ మొదటిసారి కన్నడ సినిమా ఆయన గిల్లితో తన కెరీర్ ని ప్రారంభించింది. ఆ తర్వాత తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ్ హిందీ వంటి భాషలలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే బాలీవుడ్లో ఇప్పటివరకు సరైన సక్సెస్ రాలేదు కానీ తన బాయ్ ఫ్రెండ్ నిర్మాత కావడం చేత పలు సినిమాలలో అవకాశాలు వస్తున్నట్లు సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: