న్యూ ఇయర్ రోజే దేవర నుంచి అదిరిపోయే అప్డేట్..!!

Divya
జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర.. డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. rrr సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. ఆచార్య సినిమాతో ఫ్లాప్ అందుకున్న కొరటాల శివ కచ్చితంగా ఈసారి సాలిడ్ విజయాన్ని అందుకోవాలని కసితో పనిచేస్తున్నారు. అందుకే దేవర చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తూ ఉన్నారు.. పక్క ప్లానింగ్ ప్రకారమే ఈ చిత్రాన్ని త్యాకెక్కించి ఇండస్ట్రీ హిట్టు కొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎన్టీఆర్కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తూ ఉన్నారు. పూర్తిస్థాయి యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం హాలీవుడ్ స్థాయిలోని టెక్నీషియన్స్ ని పనిచేసేలా ప్లాన్ చేయడం జరిగింది. తాజాగా చిత్ర యూనిట్ ఎన్టీర్ అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్ అంటు దేవర చిత్రానికి సంబంధించి ఒక అప్డేట్ను సైతం అందించారు.. దేవర చిత్రానికి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ జనవరి 8వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది.

ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర బృందం ఆసక్తికరమైన పోస్టుని చిత్ర బృందం తెలియజేశారు. సముద్రం మధ్యలో జూనియర్ ఎన్టీఆర్ పడవ పైన ఉన్న లుక్ లో ఆకట్టుకుంటున్నారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ సైతం ట్విట్టర్ వేదికగా తెలియజేశారు అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ ను తెలియజేస్తూ.. దేవర గ్లింప్స్ చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నానంటూ ట్విట్ చేశారు. మరి 8వ తేదీ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్  రోల్లో నటిస్తున్నట్లు సమాచారం. తండ్రి కొడుకుల పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. సైఫ్ అలీ ఖాన్ కి జోడిగా చైత్ర రామ్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద 9 భాషలలో ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: