2023 లో అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాల లిస్టు ఇదే..!!

Divya
ఈ ఏడాది టాలీవుడ్లో ఊహించని సినిమాలు భారీ విజయాలను అందుకున్న..ఈ ఏడాది చాలామంది స్టార్ హీరోల చిత్రాలు కూడా భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద ప్లాపులుగా మిగిలాయి. అలా ఈ ఏడాది టాలీవుడ్ల పెద్దగా కలిసి రాలేదని ఇండస్ట్రీకి చెప్పవచ్చు.. ఈ ఏడాది టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలిన చిత్రాల విషయానికి వస్తే ఏజెంట్ సినిమా మొదటి స్థానంలో ఉన్నది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.ఈ సినిమా లో పెట్టుబడులు పెట్టిన కేవలం 10 శాతం కూడా వెనక్కి రాబట్ట లేకపోయింది. ఇప్పటికీ ఈ సినిమా ఓటీటి లోకి రాకపోవడం గమనార్హం.

హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శాకుంతలం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలింది.డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా సమంత నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే కొన్ని కోట్ల రూపాయలు నష్టాన్ని మిగిల్చిందని తెలుస్తోంది. హీరో ప్రభాస్ నటించిన ఆది పురుష్ చిత్రం కూడా ఆడియన్స్ లో భారీ హైట్ ని క్రియేట్ చేశాయి.. కానీ విడుదలైన తర్వాత విమర్శలు నెగిటివిటీ కారణంగా ఈ సినిమాలో పెట్టుబడిలో 40% కూడా వెనక్కి తేలేకపోయిందట.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ నటించిన మల్టీ స్టార్ చిత్రం బ్రో ఆడియన్స్ ని కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. ఆ తర్వాత రవితేజ నటించిన రావణాసుర టైగర్ నాగేశ్వరరావు సినిమాలు కూడా బాక్సాఫీసు వద్ద ఫెయిల్యూర్ గా నిలిచాయి. గోపీచంద్ నటించిన రామబాణం సినిమా అలాగే కళ్యాణ్ రామ్ నటించిన ఆమీ గోష్, నాగశౌర్య నటించిన రంగ బలి, స్కంద, నితిన్ ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ కస్టడీ గాండీవ దారి అర్జున ఆదికేశవ తదితర చిత్రాలు భారీ డిజాస్టర్ గా మిగిలాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: