ధూమ్ -4లో రామ్ చరణ్ నటిస్తున్నాడా..?
ఇటీవల కాలంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా వార్-2 సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో హృతిక్ రోషన్ ని ఢీకొట్టే పాత్రలో కనిపించబోతోంది అంటూ రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. rrr సినిమాతో స్నేహితుడిగా మంచి పేరు సంపాదించిన రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎన్టీఆర్ బాటలోనే రామ్ చరణ్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ ఎక్కువగా ముంబై పరిసర ప్రాంతాలలోనే తిరుగుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం బిజినెస్ కోసం అని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా అక్కడ ఒక ఫ్లాట్ ను కూడా తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు రావడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారుతోంది.
ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ ధూమ్-4 చిత్రంలో నటించబోతున్నారని ప్రచారం తెర మీదికి రావడం జరిగింది. వార్ సినిమాలోకి తారక్ వెళ్ళినట్లుగా ధూమ్ ఫ్రాంచేసిలోకి రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. యశ్ రాజ్ బ్యానర్ లో ఏ హీరో నటించిన వారికి మంచి క్రేజీ వస్తుంది ఒకవేళ అలాంటి ఛాన్స్ రామ్ చరణ్ కు వస్తే చేస్తారా లేదా అనే విషయం పైన కూడా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే ఇప్పటివరకు ఈ సిరీస్ లో బాలీవుడ్ యాక్టర్స్ మాత్రమే కనిపించారు. మరి ఈ విషయంపై రామ్ చరణ్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి