కల్కి అనే టైటిల్ పెట్టడానికి కారణం ఉందా..!!

Divya
ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ వైజయంతి మూవీస్ బ్యానర్ పైన భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న మైథాలజీ చిత్రం కల్కి 2898 AD. ఈ చిత్రంలో అమితాబచ్చన్ దీపికా పదుకొనే, కమలహాసన్, దిశాపటాని వంటి వారు నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసినప్పటి నుంచి భారీ క్రేజ్ ఏర్పడింది ముఖ్యంగా డియాగో కామిక్- కాన్ లో లాంచ్ చేయడం జరిగింది.. దీంతో అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. అయితే తాజాగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఐఐటి బాంబేలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
అక్కడ టెక్ పేస్ట్ 23 లో కల్కి చిత్రానికి సంబంధించి ఒక ప్రత్యేక ఈవెంట్ ని జరిపించారు. అక్కడ ఈ సినిమాకి సంబంధించి పలు విషయాలను పంచుకోవడం జరిగింది డైరెక్టర్.. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ సైన్స్ ఫిక్షన్ చిత్రాలు ఎక్కువగా మన దగ్గర రాలేదని కొన్ని టైం ట్రావెల్ సినిమాలు మాత్రమే వచ్చాయని కల్కి సినిమా చాలా డిఫరెంట్ చిత్రమని ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగే కథని హాలీవుడ్ ఫ్యూచరిస్ట్ సినిమాలు అక్కడ సిటీలో భవిష్యత్తులో ఎలా ఉంటాయనేది చూశాము.. కానీ కల్కి సినిమాలో ఫ్యూచర్ సిటీలు ఎలా ఉండబోతున్నాయో ప్రేక్షకులకు చూపించబోతున్నామంటూ తెలిపారు.
కల్కి సినిమా కోసం చాలా డిజైన్ వర్క్ చేసాము కాన్సెప్ట్ ఆర్టిస్టులు ప్రొడక్షన్ డిజైనర్ ఇతరత్రా వంటి వారు చాలా మేధాతనంతో చేశారు.. కల్కి సినిమాలో ఉండే ఆయుధాలు సైతం భారతీయ మూలంతో ముడిపడి ఉంటాయి.. ఇందులో నటించిన నటీనటులు పాత్రలు ఎలా ఉంటాయో ఇప్పుడు చెప్పకూడదు.అమితాబచ్చన్ గారు, కమల్ హాసన్ గారు ,దీపిక పదుకొనే వీళ్లంతా అభిమానులు ఆనందపడేలా ఈ పాత్రలు ఉంటాయని చెప్పగలనని తెలిపారు. కల్కికీ 2898 AD అనే టైం లైన్ ని సినిమా దగ్గర పడుతున్న సమయంలో మాత్రమే చెబుతానని తెలిపారు..ఈ కల్కి సినిమా ఇండియన్ రూటుతో వరల్డ్ ఫీలింగ్ కలిగించే మ్యూజిక్ ని అందిస్తున్నామని తెలిపారు. త్వరలోనే విడుదల తేదీని అనౌన్స్మెంట్ చేస్తామంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: