హీరో విజయ్ దళపతి పై చెప్పు విసిరిన గుర్తు తెలియని వ్యక్తి..!!
నటుడు విజయ్ దళపతి కూడా గురువారం రాత్రి చెన్నైలోని ఐలాండ్ గ్రౌండ్లో విజయకాంత్ పార్థివ దేహనికి నివాళులు అర్పించడం జరిగిందట. ఆయనను చివరి చూపు చూసుకొని చాలా బాగా ద్వేగానికి లోనయ్యారు. అలా తిరిగి వెళుతున్న నేపథ్యంలోనే ఒక చేదు అనుభవం ఎదురయింది.. విజయ్ రాకతో అభిమానులు సైతం గుంపులు గుంపులుగా వచ్చేశారు. ఆయన కారు వద్దకు వెళుతూ ఉండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి విజయ్ పైన చెప్పు విసిరారు..అది విజయ్ తలకు తగిలి కింద పడిపోయినట్టుగా ఈ వీడియోలో చూపించడం జరిగింది.
దీంతో అక్కడున్న వారంతా గందరగోళానికి గురయ్యారు కచ్చితంగా ఈ పని అజిత్ అభిమానుల చేసి ఉంటారంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు విజయ్ వచ్చిన పరిస్థితి ఏమిటి అనేది చూడకుండా ఇలాంటి చెత్త పనులు చేయడం ఏంటి అంటూ చాలామంది నేటిజెన్సీ సైతం ఫైర్ అవుతున్నారు.. మరి కొంతమంది హీరోలు హీరోలు బాగానే ఉంటారు మీరు కొట్టుకొని ఇలాంటి పనులు చేస్తే పోలీసులకు చిక్కి తన్నులు తింటారంటూ మరి కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ముఖ్యంగా విజయ్ కు విజయ్ కాంత్ కు మధ్య మంచి స్నేహబంధం ఉందని విజయకాంత్ సినిమాలో విజయ్ చాలా బాలు నటుడుగా ఎన్నో చిత్రాలలో నటించారట. ఆ అనుబంధంతోనే విజయ్ అంతగా ఎమోషనల్ అయ్యారని సమాచారం.