ఓటిటిలోకి సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక మూవీ..!!
ఇటీవల ఈ ముద్దుగుమ్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మై నేమ్ ఇస్ శృతి.. ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ కథ అంశంతో తెరకెక్కించారు. నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు పూర్తయిందో తెలియదు అనూహ్యంగా వాయిదా పడుతూ వస్తూ వచ్చింది. సరికొత్త కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీనివాస ఓంకార్ తెరకెక్కించారు.. లేడీ ఓరియంటెడ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా హన్సికకు ప్లాపును తెచ్చి పెట్టింది. ఇందులో నటనపరంగా విమర్శకుల నుంచి హన్సిక ప్రశంశాలు సైతం అందుకుంది.
ఈ సినిమా ఇప్పుడు సైలెంట్ గా ఓటీటి లో స్ట్రిమ్మింగ్ కాబోతోంది. ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈరోజు మధ్యాహ్నం స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలియజేసింది. ఈ చిత్రం తెలుగు తమిళ భాషలలో అందుబాటులోకి రాబోతోంది.ఇందులో మురళీ శర్మ పూజ రామచంద్రన్ కీలకమైన పాత్రలో నటించారు.. కథ విషయానికి వస్తే ఒక యాడ్ ఏజెన్సీలో పనిచేసే శృతి స్కిన్ మాఫియాలో ఎలా పడింది ఆ మాఫియా నుంచి ఈమె ఎలా బయటపడింది అనే కదా అంశంతో విడుదల కావడం జరిగింది. థియేటర్లో మెప్పించ లేకపోయినా హన్సిక మరి ఓటీటి లో ఎలా మెప్పిస్తుందో చూడాలి.