"సైంధవ్" నుండి "బుజ్జి కొండవే" సాంగ్ విడుదల తేదీ... సమయం వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఈయన తన కెరియర్ లో ఎన్నో అదిరిపోయే రేంజ్ విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే వెంకటేష్ తాజాగా సైంధవ్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా మంచి గుర్తింపును ఏర్పరచుకున్న శైలేష్ కొలను దర్శకత్వం వహించగా ... జెర్సీ మూవీ తో తెలుగు పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటిగా కెరియర్ ను కొనసాగిస్తున్న శ్రద్ధ శ్రీ నాథ్ ఈ మూవీ లో వెంకటేష్ కి జోడీ గా నటించింది.
 

ఇకపోతే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను అధికారికంగా ప్రకటించింది. 

తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాలోని "బుజ్జి కొండవె" అంటూ సాగే సాంగ్ ను రేపు అనగా డిసెంబర్ 29 వ తేదీన సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ఈ మూవీ నుండి ఇప్పటికే చిత్ర బృందం కొన్ని సాంగ్స్ ను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాలను లభించింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: