తండెల్ :పుష్ప తరహాలో కనిపిస్తున్న నాగచైతన్య..!!

Divya
అక్కినేని నట వారసుడిగా నాగచైతన్య సరికొత్త కథ అంశంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతూ ఉన్నారు. మొదట తన కెరియర్ని జోష్ సినిమాతో మొదటిసారి మొదలుపెట్టిన నాగచైతన్య.. ఎన్నో చిత్రాలలో నటించడం జరిగింది. ఇటీవలే దూత అనే వ్యక్తి డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చారు.. ప్రస్తుతం సరికొత్త కదా అంశంతో చందు మొండేటి తెరకెక్కిస్తున్న తండేల్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. మొట్టమొదటి సారిగా పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు నాగచైతన్య. ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్ పైన బన్నీ వాసు నిర్మిస్తూ ఉన్నారు..

ఇందులో నాగచైతన్య సరసన సాయి పల్లవి నటిస్తూ ఉండ గా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కొంతమంది మత్స్యకారుల నిజ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం. ఇందులో నాగచైతన్య ఒక మత్స్యకారుడిగా కనిపించబోతున్నారు. ఈ మధ్యనే ఈ చిత్రానికి సంబంధించి పూజ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలవ్వడంతో తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నాగచైతన్య లుక్ ఒకటి వైరల్ గా మారుతున్నది.

పాత్ర కోసం ఎంత కష్టన్నైనా భరించిన నాగచైతన్య ఇందులో మత్స్యకారుడిగా డీ గ్లామరస్ బాయిగా కనిపించబోతున్నారు. ముఖ్యంగా ఊర మాస్ గెటప్పులో దర్శనం ఇవ్వడమే కాకుండా ఫుల్ గడ్డం పెంచేసి మాసిన షర్టు నుదుటున బొట్టు పెట్టుకొని అసలు ఊహించని గెటప్లో కనిపించారు.. సడన్గా చూస్తే.. పుష్ప గెటప్పులో కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా కోసం నాగచైతన్య ఎంత కష్టపడుతున్నారో  ఈ ఫోటో చూస్తే మనకి అర్థమవుతుంది. మరి ఈ సినిమాతో నైనా అక్కినేని నాగచైతన్య పాన్ ఇండియా హీరోగా పేరు ఎలా సంపాదించుకుంటారో చూడాలి మరి. ఈ చిత్రం కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: