యానిమల్ లో.. ఆ సీన్స్ లో నటించడానికి ఇబ్బంది పడ్డా : బాబీ డియోల్

praveen
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా యానిమల్ మేనియా కొనసాగుతూ ఉంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ.. ఇక బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకా వసూళ్ల సునామీ సృష్టిస్తూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రణబీర్ కపూర్ హీరోగా నటించగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటించింది. ఇక విలన్ పాత్రలో బాబి డియోల్ అదరగొట్టేసాడు అని చెప్పాలి. ఇక ఈ మూవీలోని ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకుడికి తెగ నచ్చేసింది. దీంతో ఇక ఈ సినిమా విడుదలై 20 రోజులు గడుస్తున్న ఇంకా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అవుతుంది యానిమల్ మూవీ.

 ఇప్పటికే 900 కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా.. ఇంకా భారీగా వసూలు సాధిస్తూ దూసుకుపోతూనే ఉంది. అయితే ఇక ఈ మూవీలోని పాత్రల్లో నటించిన ప్రతి ఒక్కరికి కూడా మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పాలి. ముఖ్యంగా ఇక విలన్ బాబీ డియోల్ నటనకు అయితే ప్రేక్షకులు అందరూ ఫిదా అయిపోయారు. ఏకంగా ఒక క్రూరమైన విలన్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు బాబి డియోల్. ఇక కొన్ని కొన్ని సీన్స్ లో  అయితే ఇంత క్రూరంగా చూపించారేంటి అని ప్రేక్షకులకు అనిపించేంతల ఇక పాత్రలో ఒదిగిపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే యానిమల్ లో కొన్ని సన్నివేశాలలో నటించడానికి ఇబ్బంది పడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు బాబి డియోల్.

 సినిమాలోని కొన్ని సీన్లలో నటించే సమయంలో తనకు ఎంతో ఇబ్బంది కలిగింది అంటూ తెలిపాడు. ఆ భావాలను తొలగించడానికి తాను కేవలం ఒక పాత్రలో మాత్రమే నటిస్తున్నాను అనుకునేవాడిని అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మూవీలో తన క్యారెక్టర్ ను విలన్ గా భావించలేదని.. కుటుంబాన్ని అతిగా ప్రేమించే వ్యక్తిగా భావించాను అంటూ తెలిపాడు. తాతయ్య మరణానికి ప్రతీకారం తీర్చుకునే ఒక వ్యక్తిగా అనుకొని.. ఇక ఈ పాత్రలో నటించాను అంటూ తెలిపారు బాబి డియోల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: